విద్యార్థులు లక్ష్యసాధనతో ముందుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-05-20T04:56:27+05:30 IST

విద్యార్థినులు లక్ష్య సాధనతో ముందుకెళ్లాలని షీటీమ్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఐ సుధామాధురి పేర్కొన్నారు.

విద్యార్థులు లక్ష్యసాధనతో ముందుకెళ్లాలి
విద్యార్థినులతో షీటీమ్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ సుధామాధురి

- ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలు  

- షీ టీమ్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఐ సుధామాధురి

ఊట్కూర్‌/మక్తల్‌ రూరల్‌, మే 19 : విద్యార్థినులు లక్ష్య సాధనతో ముందుకెళ్లాలని షీటీమ్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఐ సుధామాధురి పేర్కొన్నారు. గురువారం మక్తల్‌ పట్టణంలో కొనసాగుతున్న ఊట్కూర్‌ బ్రాంచ్‌ జూనియర్‌ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళల హక్కుల రక్షణకు షీ టీమ్‌ ప్రత్యేకంగా పని చేస్తోంద న్నారు. విద్యార్థినులను వేధింపులకు గురి చేసినా, ర్యాగింగ్‌ చేసినా కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. స్కూల్స్‌ కళాశాల, బస్టాప్‌ ఇతర నిర్మానుష ప్రాంతాల్లో ఎవరైన అమ్మాయిలను వేధిస్తే షీ టీమ్‌ పోలీస్‌ హెల్ఫ్‌లైన్‌ నెంబర్‌ 7901022492కు లేదా డయల్‌ 100కు కాల్‌ చేయాలన్నారు. సెల్‌ఫోన్‌ల వినియోగం ఎక్కువ అయ్యిందని, దాని వల్ల మంచి కన్న చెడు ఎక్కువ జరుగుతున్నదన్నారు. సోషల్‌ మీడియాకు అలవాటు పడి సమయం వృథా చేసుకోరాదన్నారు. సెల్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గింగి చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. అదే విధంగా షీటీమ్‌ పని విధానం, ఫోక్సో యాక్టు, ఈవిటీజింగ్‌, ర్యాగింగ్‌, గుడ్‌ టాచ్‌, బ్యాడ్‌ టచ్‌, అమ్మాయిల వేధింపులు చదువుపై శ్రద్ద, గోల్‌ సెట్టింగ్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, షీ టీమ్‌ సభ్యులు మమత, బాల్‌రాజ్‌, లయక్‌  పాల్గొన్నారు 

Updated Date - 2022-05-20T04:56:27+05:30 IST