ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ కళాశాల కర్క్‌కు విద్యార్థుల ఫోన్‌

ABN , First Publish Date - 2022-06-25T06:26:10+05:30 IST

కళాశాల క్లర్క్‌కుఫోన్‌ చేసి ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించడాని చెప్పడంతో బాధిత క్లర్క్‌ దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది.

ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ  కళాశాల కర్క్‌కు విద్యార్థుల ఫోన్‌

దిశ పోలీసులకు సమాచారం 

పోలీసుల అదుపులో విద్యార్థులు

మార్కాపురం, జూన్‌ 24: కళాశాల క్లర్క్‌కుఫోన్‌ చేసి ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించడాని చెప్పడంతో బాధిత క్లర్క్‌ దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. స్థానిక ట్రినిటీ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో వారు మొదటి సంవత్సరం ఫైయిలయ్యారు. రీవ్యాల్యూషన్‌ కోసం కళాశాల అకౌంటెంట్‌ షేక్‌ రేష్మను ఈ నెల 22న ఫీజ్‌ ఎంత అవుతుందని అడిగారు. అందుకు ఆమె రూ.1000లు చెల్లించాలని సమాధానం చెప్పింది. అనంతరం విద్యార్థులు దినకర్‌, బాలవెంకటేశ్వర్లు, రాజాలు గురువారం రాత్రి మద్యం సేవించారు. రాత్రి 11 గంటల సమయంలో బాల వెంకటేశ్వర్లు అకౌంటెంట్‌ రేష్మాకు ఫోన్‌ చేశాడు. మీరు ఫీజు ఎక్కువగా చెప్పడం వల్ల దినకర్‌ పురుగుల మందు తాగాడని చెప్పాడు. మరో పది నిమిషాల తర్వాత రాజా ఫోన్‌ చేసి దినకర్‌ ఆస్పత్రిలో ఉన్నాడని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నాడు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు రేష్మాకు ఫోన్‌ చేశారు. భయాందోళనకు గురైన రేష్మా దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన పోలీసులు గురువారం రాత్రి దినకర్‌, బాల వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. రాజాను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పట్టణ ఎస్సై శశికుమార్‌ విచారిస్తున్నారు.

Updated Date - 2022-06-25T06:26:10+05:30 IST