సర్టిఫికెట్ల పరిశీలనలో విద్యార్థుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2020-12-04T05:03:46+05:30 IST

కృషి వి జ్ఞాన కేంద్రంలో అగ్రికల్చర్‌ బీ ఎస్సీ, హార్టికల్చర్‌ బీఎస్సీలో చేరే విద్యార్థుల సర్టిఫికెట్ల తనిఖీలో అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు.

సర్టిఫికెట్ల పరిశీలనలో విద్యార్థుల ఇక్కట్లు


ప్రణాళిక లేకుండా వ్యవహరించిన అధికారులు

దర్శి, డిసెంబరు 3 : కృషి వి జ్ఞాన కేంద్రంలో అగ్రికల్చర్‌ బీ ఎస్సీ, హార్టికల్చర్‌ బీఎస్సీలో చేరే విద్యార్థుల సర్టిఫికెట్ల తనిఖీలో అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. ఎంసెట్‌లో ర్యాంకులు సా ధించిన విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన 3, 4, 5 తేదీల్లో జరుగుతుందని అధికారులు ప్రకటించారు. జిల్లాకు చెందిన విద్యార్థులు దర్శి కృషి వి జ్ఞాన కేంద్రంలో ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకోవాల్సి ఉంది. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో పరిశీలన పూర్తికాగా రైతుల కోటా కింద ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్లు మాత్రమే ఇక్కడ పరిశీలనకు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మంది విద్యార్థులు రైతల కోటా  కింద ఎంపికయ్యారు. 3, 4, 5 తేదీల్లో ఏ ప్రాంతం వారు ఏ రోజు రావాలో యూనివర్సిటీ అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. దీంతో మొత్తం 150 మంది విద్యార్థులు గురువా రం కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చారు. ఇక్కడ  పరిశీలనకు ఒకేఒక్క అధికారి శిక్షణ తీసుకొని వచ్చాడు. మూడు రోజుల పాటు జరిగే ఇంటర్వ్యూలకు రావాల్సిన విద్యార్థులు ఒకేరోజు రావడంతో సమస్య తీవ్రమైంది. దీనికి తోడు సర్వర్‌ కూడా సక్రమంగా పనిచేయకపోవటంతో మద్యాహ్నం 3 గంటల వరకు  ప్రక్రి య ముందుకు సాగలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చేయడంతో అధికారులు స్పందించి రెండవ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై కృషి విజ్ఞాన కేంద్రం పోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా  వర్సిటీ అధికారులు 3 రోజుల పాటు జరిగే ఇంటర్వ్యూలకు ఏ రోజు ఏ ప్రాతం వారు ఎంతమంది హజరుకావాలో అన్న విషయాన్ని చెప్పకపోవడంతో విద్యార్థులు ఒకేరోజు రావడంతో సమస్య ఎదురైందన్నారు. వీలైనంత వరకు వచ్చిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తాం. ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు. 





Updated Date - 2020-12-04T05:03:46+05:30 IST