బస్‌చార్జీల పెంపుపై విద్యార్థుల నిరసన ర్యాలీ

Published: Wed, 06 Jul 2022 01:31:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బస్‌చార్జీల పెంపుపై విద్యార్థుల నిరసన ర్యాలీకొత్తూరుజంక్షన్‌లో మానవహారం నిర్వహించిన విద్యార్థులుచోడవరం, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం పీటీడీ బస్‌ చార్జీల పెంపును నిరసిస్తూ పీడీఎస్‌వో ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌వో జిల్లా అధ్యక్షుడు సుంకర రుద్రి మాట్లాడుతూ.. పెంచిన చార్జీలతో బస్‌ ప్రయాణాలకు విద్యార్థులను దూరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి కొత్తూరు జంక్షన్‌ వరకూ ర్యాలీగా వచ్చి అనంతరం అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో బస్సు సర్వీసులు నడపాలని, బస్సు పాసు ధరలు తగ్గించాలని, చోడవరంలో స్టూడెంట్ల కోసం బస్‌ పాస్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో పీడీఎస్‌వో నాయకులు ఎం.జగదీశ్‌, మౌనిక, భాస్కర్‌, సన్యాసినాయుడు, లోవరాజు, నాగేశ్వరరావు, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.