54 మంది విద్యార్థులకు కరోనా

Mar 2 2021 @ 19:19PM

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ హర్యానా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో ఒక పాఠశాల హాస్టల్‌కు చెందిన 54 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో వైద్య బృందాలు సంఘటనా స్థలమైన హాస్టల్‌కు చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. హాస్టల్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం డిసెంబరులో 9-12 తరగతుల విద్యార్థులను పాఠశాలలకు వెళ్లేందుకు అనుమతించింది. ఫిబ్రవరి 24 నుంచి 3-5 తరగతుల విద్యార్థులను పాఠశాలలకు వెళ్లేందుకు అనుమతించింది. పాఠశాలలు ప్రారంభించిన కొన్ని వారాల్లోనే విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.