
- పీఈటీ అరెస్టు
వేలూరు(చెన్నై): రాణిపేట జిల్లా కారై గ్రామంలో ప్రభుత్వ పిల్లల అబ్జర్వేషన్ పాఠశాల ఉంది. ఇక్కడ సుమారు 120 మంది విద్యార్థులున్నారు. వారంతా ఓ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలో చదువుతున్నారు. తిరుపత్తూర్ జిల్లా మండపవాడికి చెందిన సెంథిల్‌కుమార్ (47) ఆ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. గత వారం ఈ పాఠశాలను సూపరింటెండెంట్ జయకుమార్ సందర్శించగా విద్యార్థినుల ప్రవర్తనలో మార్పులను గమనించి విచారించాడు. ఉపాధ్యాయుడు సెంథిల్‌కుమార్ రెండేళ్లుగా కొందరు విద్యార్థులను లైంగికంగా వేధించినట్లు, ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని ఒత్తిడి చేశాడని తెలిసింది. దీనిపై జయకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన రాణిపేట మహిళా పోలీసులు సెంథిల్‌కుమార్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి వేలూరు జైలుకు తరలించారు. నిందితుడికి వివాహమై నలుగురు కుమార్తెలున్నారు.
ఇవి కూడా చదవండి