విద్యార్థులు వైజ్ఞానిక రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2021-02-28T05:00:37+05:30 IST

విద్యార్థులు వైజ్ఞానిక రంగాల్లో రాణించాలి

విద్యార్థులు వైజ్ఞానిక రంగాల్లో రాణించాలి
ఎగ్జిబిట్‌ను పరిశీలిస్తున్న ప్రొఫెసర్‌ విజయ్‌శ్రీనివాస్‌

సౌతాఫ్రికా యూనివర్సిటీ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ విజయ్‌శ్రీనివాస్‌

శంషాబాద్‌రూరల్‌ : విద్యార్థులు వైజ్ఞానిక రంగాల్లో రాణించాలని సౌతాఫ్రికా యూనివర్సిటీ సైంటిస్ట్‌, ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌శ్రీనివాస్‌ అన్నారు. శంషాబాద్‌ మండల పరిధిలోని పాల్మాకుల మోడల్‌ స్కూ ల్‌లో శనివారం ప్రిన్సిపాల్‌ విష్ణుప్రియ ఆధ్వర్యంలో జరిగిన సైన్స్‌ ఫెయిర్‌కు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల దశ నుంచే విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పట్టు సాధించేలా తయారు చేయాలని చెప్పారు. అంతకు ముందు విద్యార్థులు రామన్‌ స్కాటరింగ్‌, స్మొక్‌ డిటెక్టర్‌, వ్యాక్యూబ్‌ క్లీనర్‌ రోబో వంటి మొత్తం 33 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సౌతాఫ్రికా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటరింగ్‌ సీనియర్‌ లెక్చరర్‌ డాక్టర్‌ శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:00:37+05:30 IST