విద్యార్థులు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి

ABN , First Publish Date - 2022-06-29T05:54:21+05:30 IST

విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు.

విద్యార్థులు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ హరిచందన

దామరగిద్ద, జూన్‌ 28 : విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు. మంగళవారం మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా దామరగిద్ద ఉన్నత పాఠశాలతో పాటు పరిసరాలను పరిశీలించి కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతీ అవకాశాన్ని విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం సోలార్‌ ప్లాంట్‌ ఆధ్వ ర్యంలో అందించిన 30 సైకిళ్లను విద్యార్థినులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఈవో లియాఖత్‌ అలీ, స్పెషల్‌ అధికారి విద్యాసాగర్‌, శ్రీనివాస్‌, ఎంఈవో వెంకటయ్య, ఎంపీపీ నర్సప్ప, ఎంపీడీవోలు శశికళ, రామన్న, హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు తిరుపతయ్య, శంబులింగం తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం

నారాయణపేట టౌన్‌ : కలెక్టరేట్‌లో మంగళవారం పౌర సరఫరాల అధికారి సీతారాం ఆధ్వర్యంలో కలెక్టర్‌ హరిచందన అధ్యక్షతన జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 202 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు పొందుటకు ఆమోదించారు. కార్యక్ర మంలో అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు టీయూడబ్ల్యూజే హెచ్‌-143 నవీన్‌, టీ యూడబ్ల్యూజే ప్రతినిధి నారాయణరెడ్డి, ఫెడరేషన్‌ నుంచి వెంకట్రాములు, బ్రహ్మానంద రాజు, వీడియో ఎలక్ర్టానిక్‌ మీడియా సభ్యులు అంబాదాస్‌, లక్ష్మీకాంత్‌  పాల్గొన్నారు.

స్వచ్ఛ అలవాట్లపై చర్యలు తీసుకోవాలి

జిల్లాలోని విద్యార్థులు స్వచ్ఛ అలవాట్లను పాటించేలా విద్యాలయ పురస్కార అవార్డులు పొందిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిచందన సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో స్వచ్ఛ విద్యాలయ్‌ పురస్కార్‌ 2021-22 జిల్లా స్థాయి పురస్కార్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో 34 అవార్డులను వారు ప్రదానం చేసి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఈవో లియాఖత్‌ అలీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:54:21+05:30 IST