‘పది’ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులు

ABN , First Publish Date - 2022-07-01T06:05:48+05:30 IST

‘పది’ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులు

‘పది’ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులు

‘వికారాబాద్‌/బంట్వారం(కోట్‌పల్లి)/ధారూరు/బషీరాబాద్‌/ తాండూరు/తాండూరు రూరల్‌/పెద్దేముల్‌/పరిగి/ కులకచర్ల/ దోమ/ పూడూరు/కొడంగల్‌ / బొంరా్‌సపేట్‌/కీసర రూరల్‌/ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/మేడ్చల్‌/శామీర్‌పేట, జూన్‌ 30 : పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ మండలం కొత్తగడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు స్రవంతి, శ్రావణిలు 10 జీపీఏ సాధించారు. 50శాతం మంది విద్యార్థులు 9 గ్రేడ్‌ పైన మార్కులు సాధించడం జరిగిందని ప్రిన్సిపాల్‌ అపర్ణ తెలిపారు. సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో 76 మంది విద్యార్థుల్లో జె.భావన 10 జీఏపీ సాధించగా 99శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అనంతగిరి సాంఘింక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలో శివకుమార్‌, 10 జీపీఏ, కస్తూర్భా గాంధీ పాఠశాలలో శృతి, మహేశ్వరిలు 10జీఏపీ సాధించినట్లు ఎంఈవో బాబుసింగ్‌ తెలిపారు.

అలాగే కోట్‌పల్లి మండలంలో ఆరు పాఠశాలలకు గాను నాలుగు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో చంద్రయ్య తెలిపారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఈశ్వరికి 10 జీపీఏ, శ్రావణి 9.8 జీఏపీ సాధించినట్లు తెలిపారు, బంట్వారం మండలం సల్భత్తాపూర్‌ పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో విద్యార్థిని హారికకు 10.10 జీపీఏ సాధించినట్లు ఎంఈవో చంద్రప్ప తెలిపారు. ధారూరు మండలంలోని 9 ఉన్నత పాఠశాలల్లో  94.59 శాతం మంది  విద్యార్థులు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి బాబుసింగ్‌ గురువారం  తెలిపారు.  ధారూరు బాలుర ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్న ఎబ్బనూర్‌కు చెందిన సౌమ్య 9.7జీపీఏ సాధించి మండల టాపర్‌గా నిలిచింది. కేరెల్లి ఉన్నత పాఠ శాలలో శతశాతం ఫలితాలు సాధించగా, ధారూరు బాలుర ఉన్నత పాఠశాల, కుక్కింద, నాగసమందర్‌ పాఠశాలల్లో  ఇంగ్లీష్‌  మీడియం విభాగంలో  100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ధారూరులోని కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాల ఉత్తీర్ణతలో వెనుకబడింది.  విద్యాలయంలో 85.4 శాతం మంది విద్యార్థినులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా బషీరాబాద్‌ మండలంలోని బషీరాబాద్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాల(బాలికలు) విద్యార్థినులు జి.అవంతి, ఎ.నిఖిత 9.7 జీపీఏ సాధించి మండల టాపర్లుగా నిలిచారు. మైల్వార్‌ జడ్పీ పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత సాధించారు. తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్లో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించగా.. యాజమాన్యం, నిర్వాహకులు కేక్‌ కట్‌చేసి సంబరాలు నిర్వహించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులను సన్మానించారు. కళాశాల ప్రిన్సిపల్‌ ప్రశాంత్‌, డైరెక్టర్లు సతీష్‌, యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, తాండూరు మండల పరిధిలోని 14 ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో 91.73శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో వెంకటయ్యగౌడ్‌ తెలిపారు. 14 ప్రభుత్వ పాఠశాలల్లో 811 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 744 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కరణ్‌కోట్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత సాధించారు. తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో 10 జీపీఏ సాధించారు. 

అలాగే పెద్దేముల్‌ మండలంలో 94శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 533 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 501 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆడ్కిచర్ల జిల్లా పరిషత్‌ పాఠశాల, ఇందూరు ఉర్దూమీడియం, కందనెల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. పది ఫలితాల్లో పరిగి మండలం 86.04 శాతం ఉత్తీర్ణత సాధించింది. 1347 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 1159 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాపోల్‌ స్కూల్‌ వందశాతం ఉత్తీర్ణత సాధించింది. అతి తక్కువగా నస్కల్‌ పాఠశాల 64 శాతం ఉత్తీర్ణత సాధించింది. పరిగి మండల పరిధిలోని జడ్పీహెచ్‌ఎ్‌స చిట్యాల్‌లో 51 మందికి 38 మంది ఉత్తీర్ణత సాధించారు. పరిగిలోని జ్యోతిరావుపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్‌లో ముగ్గురు బాలికలు ఆర్‌.ఆర్తి 10/10, డి.అనూష10/10, సి.అర్చన 10 జీపీఏ సాధించారు. జాఫర్‌పల్లిలోని మాడల్‌ స్కూల్‌లో అరవింద్‌ 10 జీపీఏ సాధించాడు. కులకచర్ల మండలంలో బాలికల హవా కొనసాగింది. ముజాహిత్‌పూర్‌ ఆదర్శ పాఠశాల విద్యార్థి ప్రదీప్‌ 10 జీపీఏ సాధించారు. బండవెల్కిచర్ల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శోభ 9.8 జీపీఏ, ముజాహిత్‌పూర్‌ ఆదర్శ పాఠశాల విద్యార్థి సునీల్‌ 9.8 జీపీఏ సాధించారు.చౌడాపూర్‌ మండలంలో 96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం విద్యార్థులు 333 మంది పరీక్షలు రాయగా 322 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మందిపాల్‌, చాకల్‌పల్లి ఉన్నత పాఠశాలలో 100 శాతం విద్యార్థులు  ఉత్తీర్ణులయ్యారు.

దోమ మండలంలో 11 ఉన్నత పాఠశాలల్లో 81.8శాతం ఉత్తీర్ణత సాఽధించారు. దాదాపూర్‌ ఉన్నత పాఠశాల 96 శాతంతో ప్రథమ స్థానంలో నిలువగా దోమ బాలుర ఉన్నత పాఠశాల 66 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. దోమ బాలురు ఉన్నత పాఠశాల నుంచి వైష్ణవి 9.8 జీపీఏ, మధుకర్‌ 9.7 జీపీఏ సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. పూడూర్‌ మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 518 మంది విద్యార్థుల్లో 414 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన 157 మంది విద్యార్థుల్లో 153 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కంకల్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ 10 జీపీఏ సాధించాడు. కొడంగల్‌, బొంరా్‌సపేట్‌ మండలాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌కు చెందిన శుమైల అప్సర్‌ 9.8, ఐజా అంజుమ్‌ 9.7 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ ఎండీ.మక్సూద్‌అలీ తెలిపారు. నవీన ఆదర్శ కాన్వెంట్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు రేవతి ప్రియ 9.8, శివకుమార్‌ 9.2, సంతోష్‌ 9.0, సుమలత 9.0 గ్రేడ్‌ మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ డివి.నరేశ్‌రాజ్‌ తెలిపారు. బొంరా్‌సపేట్‌ మండలం బొట్లవనితండా గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు గత 5 సంవత్సరాలుగా 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

ఈ సారి కూడా 100 శాతం ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. బురాన్‌పూర్‌ గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో ఉత్తీర్ణత సాధించారు. బొట్లవనితండా గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఇప్పటితో వరుసగా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థిని నాగలక్ష్మి 10 జీపీవే సాధించగా పూజ, నందిని 9.7 జీపీఏ సాధించారు. బురాన్‌పూర్‌ మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థిని శివాని 10 జీపీఏ సాధించి సత్తా చాటింది. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. 

  • మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో..

నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. నాగారంలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో మొత్తం 150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 136 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 90.6. బి.కిరణ్‌కుమార్‌ 9.8 జీపీఏ సాధించగా, వి.నిఖిల్‌, ఎన్‌.నిఖిల్‌, కే.దిలీప్‌, టి.పరమే్‌షలు 9.7 జీపీఏ సాధించారు. నాగారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి అక్షయ అనే విద్యార్థి 10 జీపీఏ, విశేష్‌ 9.7 జీపీఏ సొంతం చేసుకున్నారు.

నాగారం మున్సిపాలిటీ రాంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి హర్షిత 9.7 జీపీఏ కైవసం చేసుకున్నారు. దమ్మాయిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి పవిత్ర అనే విద్యార్థిని 9.5 జీపీఏ సాధించింది. అదేవిధంగా ఘట్‌కేసర్‌ జడ్పీ బాలికల పాఠశాల విద్యార్థులు 77.3 శాతం, జడ్పీ బాలుర పాఠశాలలో 47.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ జడ్పీ పాఠశాలలో 51 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఘట్‌కేసర్‌(రూరల్‌) మండలంలోని 11 జిల్లా పరిషత్‌ పాఠశాలలో 489 మంది విద్యార్థులు పదత తరగతి పరీక్షలకు హాజరు కాగా 335 విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మండల విద్యాధికారి శశిధర్‌ తెలిపారు. ఎదులాబాద్‌ జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాల 94శాతం ఉత్తీర్ణత సాధించారు. కొర్రెముల జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన తనుశ్రీ 9.8 జీపీఎ సాధించగా, ఎదులాబాద్‌ జడ్పీ బాలికల పాఠశాలలో చదువుతున్న ఎదుగని శ్రీనిత్య 9.7 జీపీఏ సాధించింది. ప్రతా్‌పసింగారం జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన వర్షిత 9.7 జీపీఏ సాధించింది. ఘట్‌కేసర్‌ మండలంలో మొత్తం 68.51 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో తెలిపారు.

మేడ్చల్‌ మండలంలోని మునీరాబాద్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించింది. గుండ్లపోచంపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో 73 మందికి 59 మంది ఉత్తీర్ణులయ్యారు. శ్రీరంగవరం జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన శ్వేతారాణి 9.8 జీపీఏ సాధించగా, గౌడవెల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన శ్రావంత్‌ 9.8 జీపీఏ సాధించాడు. శామీర్‌పేట మండలంలో 76 శాతం ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి వసంతకుమారి తెలిపారు. 345 మంది బాలబాలికలు పరీక్షలు రాయగా 262 మంది ఉత్తీర్ణత సాదించినట్లు తెలిపారు. తూంకుంటు జడ్పీ ఉన్నత పాఠశాల 86 శాతం ఉత్తీర్ణత సాధించి మండల మొదటి స్థానంలో నిలిచింది. దేవరయాంజాల్‌ పాఠశాలకు చెందిన జి. దీపిక 9.8, లాల్‌గడిమలక్‌పేట పాఠశాలకు చెందిన ఎం. భాను 9.8, పొన్నాల్‌ పాఠశాలకు చెందిన కె. అంజలి 9.7, అలియాబాద్‌ పాఠశాలకు చెందిన జి. శిరీష 9.7, తుర్కపల్లి పాఠశాలకు చెందిన కల్పన 9.7 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు. అలాగే మూడుచింతలపల్లి మండలంలో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు. 197 మంది బాలబాలికలు పరీక్షలకు హాజరుకాగా 164 మంది ఉత్తీర్ణత సాధించారు. అనంతారం, పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. కేశవరం 94 శాతం ఉత్తీర్ణత సాధించింది. అనంతారం పాఠశాలకు చెందిన ఆర్‌. మనుష 9.7, లక్ష్మాపూర్‌ పాఠశాలకు చెందిన బి. స్ఫూర్తి 9.7, బి. హరిణి 9.7 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు. శామీర్‌పేటలోని మేడ్చల్‌ మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు విజయదుందుభి మోగించారు. రాహుల్‌, శ్యాంసన్‌ అనే విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. మరో 17 మంది విద్యార్థులు 9 జీపీఏ సాధించారు. మొత్తం మీద 96 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో రికార్డు సృష్టించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విక్రమ్‌ సేన్‌ అభినందించారు. కాగా, విద్యార్థులు కష్టపడి చదివి వారి ప్రాంతానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాశ్‌, మాజీ మంత్రి, భృంగీ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. గురువారం భృంగీ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 9 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా వారిని అభినందించి సన్మానించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ముఖ్యంగా పాఠశాల డైరెక్టర్‌కుమార స్వామి, ప్రిన్సిపాల్‌ రమాదేవిలను అభినందించారు.

Updated Date - 2022-07-01T06:05:48+05:30 IST