కి‘ఛీ’డి తినలేం!

ABN , First Publish Date - 2021-02-27T05:46:08+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. గురువారం సరఫరా చేస్తున్న కిచిడి, టమోటా పచ్చడితో తినలేమంటూ పలువురు విద్యార్థులు చెబు తున్నారు.

కి‘ఛీ’డి తినలేం!
భోజనం చేస్తున్న విద్యార్థులు

 పాఠశాలకు అరకొర ‘భోజనం’ సరఫరా 

 అర్ధాకలితో  విద్యార్థులు  

 ‘అక్షయపాత్ర’ పై కానరాని అధికారుల పర్యవేక్షణ  

ఆమదాలవలస, ఫిబ్రవరి 26 : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. గురువారం సరఫరా చేస్తున్న కిచిడి, టమోటా పచ్చడితో తినలేమంటూ పలువురు విద్యార్థులు చెబు తున్నారు. కిచిడికారం తట్టుకోలేక చాలామంది విద్యార్థులు దీన్ని అరకొరగా తింటూ పారబోస్తున్నారు. పోనీ ఇంటి నుంచి కారేయర్లు తెచ్చుకుందామంటే కొన్ని పాఠశా లల హెచ్‌ఎంలు అనుమతించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు అర్ధాకలితోనే గడుపుతున్నారు. ఆమదాలవలస మండలంతోపాటు మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ఏడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్నన భోజనాన్ని అక్షయపాత్ర అనే ఏజెన్సీ ద్వారా సరఫరా చేస్తున్నారు. గురువారం అందించే కిచిడిని విద్యా ర్థులు తినలేకపోవడం... మిగిలిన రోజుల్లో సరిపడినంత భోజనం సరఫరా కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు అంది స్తున్న భోజనం నాణ్యతపై ప్రజా ప్రతినిధుల సమీక్షలు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడుతున్నాయి. ఈ విషయమై ఆమదాలవలస లక్ష్మీనగర్‌ పాఠశాల హెచ్‌ఎం చింతాడ వెంకటరమణ ప్రశ్నించగా, మెనూ సక్రమంగా అమలు చేస్తున్నామని, గురువారం అందిస్తున్న కిచిడిని తినేందుకు కొంతమంది విద్యార్థులు ఇష్టపడడం లేదన్నారు. క్యారియర్లు తెచ్చుకుంటున్న విద్యార్థులకు తామేమీ అడ్డు చెప్పడం లేదని స్పష్టం చేశారు.

తన దృష్టికి రాలేదు : డీఈవో 

భోజన పథకంలో మెనూ అమల్లో లోపాలు ఉన్నట్టు ఎటువంటి ఫర్యాదులు రాలేదని డీఈవో చంద్రకళ స్పష్టం చేశారు. అయినా పరిశీలించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని తెలిపారు.  

Updated Date - 2021-02-27T05:46:08+05:30 IST