పుస్తకాల్లేని చదువులు

ABN , First Publish Date - 2022-07-06T08:25:21+05:30 IST

రాష్ట్రంలో పుస్తకాల్లేని పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మంగళవారం సీఎం జగన్‌ సహా, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా బడుల పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొని హడావిడి చేసినా ఇంకా అనేక చోట్ల పాఠశాలలకు పుస్తకాలు

పుస్తకాల్లేని చదువులు

అనేక పాఠశాలలకు చేరని టెక్ట్స్‌బుక్స్‌

‘కానుక’లో ఇచ్చింది బెల్టులు, యూనిఫాంలే..

ఏమీ లేకుండానే బడులు పునఃప్రారంభం


అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పుస్తకాల్లేని పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మంగళవారం సీఎం జగన్‌ సహా, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా బడుల పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొని హడావిడి చేసినా ఇంకా అనేక చోట్ల పాఠశాలలకు పుస్తకాలు రానేలే దు. వచ్చినచోట్ల కూడా కొన్ని తరగతులకు మాత్రమే పుస్తకాలు అందాయి. ముఖ్యంగా ఎనిమిదో తరగతి పుస్తకాలు ఒక్కటి కూడా పాఠశాలలకు చేరలేదు. కొన్ని చోట్ల అన్ని తరగతులకు కలిపి కూడా పాఠశాలలకు ఒక్క పుస్తకం కూడా చేరలేదు. మొత్తంగా చూస్తే అన్ని తరగతులకు కలిపి 50 శాతం లోపే పాఠశాలలకు పుస్తకాలు అందినట్లు తెలిసింది. ఎంఈవో కార్యాలయాల వరకు పుస్తకాలు చేరినా సరిపడ లేకపోడంతో, ఏ పాఠశాలకు ఎన్ని పంపాలో తమకు ఆదేశాలు రాలేదని ఎంఈవోలు పుస్తకాలను పంపిణీ చేయలేదు.  


  • ప్రకాశం జిల్లాలో పలు పాఠశాలల్లో ఏ తరగతికీ హిందీ పుస్తకాలు రాలేదు. 8వ తరగతి పుస్తకాలు ఒక్కటీ ఇవ్వలే దు. సెమిస్టర్‌ 1కి బదులు, సెమిస్టర్‌ 2 పంపించారు. నోట్‌ బుక్స్‌ 50శాతం మాత్రమే అందాయి. బూట్లకు కచ్చితమైన కొలతలు ఇచ్చినా, గందరగోళపు కొలతలతో పంపా రు. యూనిఫామ్‌లు 60శాతం మాత్రమే వచ్చాయి. 
  • గుంటూరులోని ఓ పాఠశాలలో యూనిఫాంలు సగం మందికి పంపారు. బూట్లు అసలు రాలేదు. విద్యాకానుకలో బెల్టులు, బ్యాగ్‌లు మాత్రమే ఇచ్చారు.  
  • విజయనగరం జిల్లాలోని ఓ పాఠశాలకు ఒక్కటంటే ఒక్క పుస్తకం కూడా చేరలేదు. పాఠశాలలు తెరిచేనాటికి అన్నీ సిద్ధం చేయాల్సిన విద్యాశాఖ టెండర్లు పిలవడంలోనే తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఎంతసేపూ పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ అంటూ ఉపాధ్యాయ పోస్టు లు తగ్గించడానికే ప్రయత్నాలు చేసింది. సెలవుల్లో పాఠ్య పుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లపై చేయాల్సిన కసరత్తును ఇతరత్రా  అంశాలకు కేటాయించింది. దీంతో పాఠశాలలు తెరిచే సమయానికి పుస్తకాలు, విద్యా కానుకలు అందుబాటులోకి రాకుండాపోయాయి. 

Updated Date - 2022-07-06T08:25:21+05:30 IST