2100 సంవత్సరం నుంచి మనుషులు 180 ఏళ్లు జీవిస్తారు.. కానీ సమస్యలు తప్పవు.. అవేటంటే?..

ABN , First Publish Date - 2022-01-12T08:06:53+05:30 IST

ప్రతి మనిషి నిండు నూరేళ్లు జీవించాలనుకుంటాడు. కానీ ప్రస్తుత కాలంలో 100 ఏళ్లు కాదు 80 ఏళ్లు బతకటం కష్టంగానే ఉంది. 60 ఏళ్లు దాటితే ఇక కాటికికాళ్లు చాపుకుని కూర్చున్నట్లే లెక్క. ఎన్నో వ్యాధులు..కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌ల వల్ల 60 ఏళ్లు కాదు కదా 50 నిండకుండానే జీవితంలో ఏమీ చూడకుండానే ప్రాణం పోగొట్టుకుంటున్న వారు ఎందరో. కానీ రాబోయే కాలంలో మాత్రం మనుషులు 100 కాదు ఏకంగా 180 ఏళ్లు బతుకుతారని..

2100 సంవత్సరం నుంచి మనుషులు 180 ఏళ్లు జీవిస్తారు.. కానీ సమస్యలు తప్పవు.. అవేటంటే?..

ప్రతి మనిషి నిండు నూరేళ్లు జీవించాలనుకుంటాడు. కానీ ప్రస్తుత కాలంలో 100 ఏళ్లు కాదు 80 ఏళ్లు బతకటం కష్టంగానే ఉంది. 60 ఏళ్లు దాటితే ఇక కాటికికాళ్లు చాపుకుని కూర్చున్నట్లే లెక్క. ఎన్నో వ్యాధులు..కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌ల వల్ల 60 ఏళ్లు కాదు కదా 50 నిండకుండానే జీవితంలో ఏమీ చూడకుండానే ప్రాణం పోగొట్టుకుంటున్న వారు ఎందరో.  కానీ రాబోయే కాలంలో మాత్రం మనుషులు 100 కాదు ఏకంగా 180 ఏళ్లు బతుకుతారని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదెలా సాధ్యం? అని సందేహం కలుగక మానదు.


మనుషులు 100 ఏళ్లు దాటి 180 ఏళ్లు జీవిస్తారని ఇది 2100 సంవ‌త్సరం లోపు మ‌నుషుల ఆయుర్ధాయం పెరుగుతుంద‌ని కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు చాలా బలంగా చెబుతున్నారు. కెనాడాలోని మాంట్రియ‌ల్‌లోని హెచ్ఈసీ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు మాన‌వుడి ఆయుర్ధాయంపై కొంతకాలంగా ప‌రిశోధ‌న చేస్తున్నారు. అత్యంత ఎక్కువ వ‌య‌సు ఉన్న  వ్యక్తి రికార్డును 2100 సంవ‌త్సరం లోపు బద్దలుకావచ్చని.. అధ్యయనం చేసిన పరిశోధకలలో ఒకరైన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ లియో బెల్‌జిలె స్పష్టం చేశారు.


ప్రస్తుతం అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా జీన్ కాల్మెంట్ అనే ఫ్రెంచ్‌ మ‌హిళ రికార్డు సృష్టించింది. ఆమె 122 ఏళ్లు జీవించి 1997లో క‌న్నుమూసింది. ఆ త‌ర్వాత ఇంకెవరూ 122 ఏళ్లు జీవించ‌లేదు. అయితే కాల్మింట్.. 122 ఏళ్లు జీవించిన రికార్డును మరి కొన్ని సంవత్సరాలలో బ‌ద్దలుకావచ్చు అని కెనెడా శాస్త్రవేత్తలు అంటున్నారు. 


కానీ ఎక్కువకాలం జీవించే కొద్దీ.. కొన్ని సమస్యలు తప్పవని కూడా వారు హెచ్చరించారు. వారి అధ్యయనం ప్రకారం ఒక‌వేళ మ‌నిషి ఆయుర్ధాయం పెరిగితే.. దాని వ‌ల్ల ఈ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మెడిక‌ల్ బిల్స్‌, హాస్పిట‌ల్ వంటి ఖ‌ర్చులు కోసం వృద్ధులు అయ్యాక ఎక్కువ ఖ‌ర్చుపెట్టాల్సి వ‌స్తుంద‌ని ప్రొఫెస‌ర్ ఎలీన్  తెలిపారు.


మనిషి ఆయుర్ధాయం పెరిగితే జరిగే మార్పుల గరించి ప్రొఫెసర్ ఎలీన్ మాట్లాడుతూ..మనిషి జీవితకాలం పెరిగితే వారికి వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా పెరుగుతాయని వారి మోకాళ్లు, తుంటి ఎముకలు, కార్నియాలు, గుండె కవటాల మార్పిడి వంటి చికిత్సల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. 


మనుషుల ఆయుర్ధాయం మీద ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిశోధ‌న ప్రకారం.. ఒక మ‌నిషి 110 ఏళ్లు జీవిస్తాడ‌నుకుంటే.. అందులో 50 ఏళ్లు పైబ‌డ‌గానే.. చ‌నిపోయే ప్రమాదం కూడా పెరుగుతూ ఉంటుంది. 80 ఏళ్లు వ‌చ్చాక చ‌నిపోయే రిస్క్ త‌గ్గుతుంది. అలా.. 110 ఏళ్ల వ‌రకు అదే రిస్క్ కొన‌సాగుతూ ఉంటుంది. 110 ఏళ్లు దాటాక మాత్రం మ‌నిషి చ‌నిపోయే ప్రమాదం ఒకేసారి 50 శాతం పెరుగుతుంది.




Updated Date - 2022-01-12T08:06:53+05:30 IST