Autoపై ‘పుష్ప’ స్టైల్లో స్టంట్స్... నీయవ్వ తగ్గేదేలే అన్న Police

Published: Wed, 29 Jun 2022 08:56:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Autoపై పుష్ప స్టైల్లో స్టంట్స్... నీయవ్వ తగ్గేదేలే అన్న Police

సంగారెడ్డి : సినిమా(Movie) ప్రభావం యువతపై ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరో(Hero)ను చూసి వారినే అనుసరిస్తుంటారు. పెద్ద హీరో సినిమా వచ్చిందంటే చాలు.. ఇక ఆ సినిమాలో హీరో మేకోవర్ చూసి వారిని ఫాలో అవడం.. ఏవైనా స్టంట్స్(Stunts) చేసి ఉంటే వాటిని యూత్ అనుసరించడం సర్వ సాధారణం. ఇలాగే ఓ యువకుడు పుష్ప సినిమా(Pushpa Movie) చూసి ఇన్‌స్పైర్(Inspire) అయ్యి.. ఆ అల్లు అర్జున్(Allu Arjun) స్టైల్లో స్టెంట్ చేశాడు. ఆ  వీడియోను చూసిన పోలీసులు నీయవ్వ తగ్గేదేలే అంటూ చలాన్ వేసి షాక్ ఇచ్చారు.


సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన మాదిగి సాయిలు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల వచ్చిన పుష్ప సినిమాను చూసిన సాయిలు.. మరో యువకుడితో కలిసి ఆ సినిమాలో అల్లు అర్జున్ స్టైల్లో స్టంట్ చేయాలనుకున్నాడు. ఇక తాజాగా దానిని ఇద్దరూ కలిసి అమల్లో పెట్టారు. నారాయణఖేడ్ పట్టణంలో పబ్లిక్ రద్దీగా ఉండే ప్రాంతంలో ఆటోపై తన స్నేహితుడిని నిలబెట్టి ఆటోను డేంజరస్‌గా నడపాడు. దీనిని మరో స్నేహితుడుతో వీడియో తీయించారు. మొత్తానికి పుష్ప స్టైల్లో వీడియో తీసి దిగ్విజయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.


సీన్ కట్ చేస్తే.. ఈ వీడియోను సోషల్ మీడియాలో నారాయణఖేడ్ పోలీసులు సైతం తిలకించారు. అంతే.. తగ్గేదేలే అంటూ.. ఆటోకు రూ.1635 ఫైన్ విధించారు. ఇకపైన ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు ఎవరైనా చేస్తే పరిస్థితి సీరియస్‌ యాక్షన్ ఉంటుందంటూ హెచ్చరించారు. హీరో లెవల్లో బిల్డప్ ఇచ్చిన యువకుడికి పోలీసులు సరైన  ట్రీట్మెంట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ స్టంట్లేంటి? వీరికిదేం పోయేం కాలం అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం వేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.