సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్
వన్‌టౌన్, మార్చి 27 : ప్రభుత్వ పాత ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డు, ప్రసూతి విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ అఽఽధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన చిన్నపిల్లల వార్డు, ప్రసూతి వార్డుల్లో సదుపాయాలను, అందుతున్న వైద్యం, చిన్నపిల్లల ఐసీయూ విభాగాలను ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వాసుపత్రులను ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని, సూపర్‌స్పెషాలిటీ సౌకర్యాలు వచ్చాయన్నారు. దీంతో రోగుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారన్న భరోసా వారికి ఇవ్వాలన్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లోని పిల్లల వార్డు నుంచి పిల్లలను అపహరిస్తున్నారని ఈ దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సూపరింటెండెంట్, వైద్యాధికారులు నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.