సుబాబు(డ)ల్‌

ABN , First Publish Date - 2021-04-19T04:36:24+05:30 IST

కాగితం పరిశ్రమల్లో ముడి సరుకుగా వినియోగించే సుబాబుల్‌ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.

సుబాబు(డ)ల్‌
లారీలో రవాణాకు సిద్ధంగా ఉన్న సుబాబుల్‌

- పడిపోయిన సుబాబుల్‌ ధరలు

- టన్నుకు రూ.1,500 చెల్లిస్తున్న కంపెనీలు 

- పెట్టుబడులు రాక రైతుకు నష్టాలు


గద్వాల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : కాగితం పరిశ్రమల్లో ముడి సరుకుగా వినియోగించే సుబాబుల్‌ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రూ.4 వేలు పలికి టన్ను ధరలు, తాజాగా రూ.1,500కు పడిపోయాయి. దీంతో పంటలను సాగు చేసిన రై తులకు పెట్టుబడి కాదు కదా, కనీసం చేసిన కష్టానికి కూడా గిట్టుబాటు లేకుండాపోయింది. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే దిగుబడులపై ఆశలు పెట్టుకు న్న రైతులకు చివరికి నిరాశే మిగిలింది.


ఐదు వేల ఎకరాల్లో సాగు

జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ ని యోజకవర్గంలో మాత్రమే సుబాబుల్‌ సాగు జరు గుతుంది. ఆర్డీఎస్‌ అయకట్టు చివరి రైతాంగానికి సాగునీరు అందకపోవడంతో చాలా మంది వర్షాధా ర పంటైన సుబాబుల్‌ను దశాబ్ద కాలంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు ఐదు వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దాదాపు ఎకరాకు 30 ట న్నుల దిగుబడులు వస్తాయి. అయితే, పంటను కొనుగోలు చేసేందుకు కాగితం కంపెనీలు ముం దుకు రావడం లేదు. గతంలో అదిలాబాద్‌ జిల్లాలో ని సిర్‌పూర్‌ కాగితం మిల్లు ఉన్న సమయంలో సు బాబుల్‌కు బాగా డిమాండ్‌ ఉండేది. ఆ మిల్లు మూతపడటంతో రైతుల కష్టాలు మొదలయ్యాయి. భద్రచలంలోని ఐటీసీ కాగితం మిల్లు నుంచి సుబాబులను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా, ప్రతి ఏటా ఏదో ఒక సాకుతో కొనుగోలు చేయడం లేదు. గతంలో మంత్రి టి.హరీశ్‌రా వు ఆ కంపెనీ ప్రతినిధులతో కూడా ఈ విషయమై మాట్లాడారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి ని రంజన్‌రెడ్డి కూడా ఐటీసీ కాగితం పరిశ్రమకు వద్ద కు వెళ్లి జోగుళాంబ గద్వాల జిల్లాలోని సుబాబుల్‌ ను కొనుగోలు చేయాలని ఆదేశంచారు. కానీ, కం పెనీ ప్రతినిధులు మాత్రం జిల్లాలోని సుబాబుల్‌ ను కేవలం టన్నుకు రూ.1,100 మించి కొనలేమి తే ల్చారు. దీంతో ఈ ధర గిట్టుబా టుకాదని ఐటీసీకి సుబాబుల్‌ను పంపించడం రైతులు మానేశారు.


ఇతర రాష్ర్టాల్లో కొనుగోళ్లు

మహారాష్ట్రలోని బల్లార్ష, కర్ణాటకలో ని డాన్‌డెల్లి ప్రాంతంలో ఉన్న కాగితం పరిశ్రమలకు చెందిన బ్రోకర్లు గద్వాలకు వచ్చి సుబాబుల్‌ను కొనుగోలు చేస్తున్నా రు. గతంలో టన్నుకు రూ.2,500 కొనుగో ళ్లు చేయగా, ప్రస్తుతం టన్నుకు రూ.1,500 చెల్లి స్తున్నారు. రైతులు చేసేది లేక వచ్చిన ధరకే పంటను అమ్ముతున్నారు. కాగా, రైతుల కష్టాలు తీర్చాలని, గిట్టుబాటు ధర కల్పించాల ని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించడం లేదని సుబాబుల్‌ రైతుల సంఘం అధ్యక్ష, ఉపా ధ్యక్షులు సీతారామయ్య, రాజేశ్వర్‌రావులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-19T04:36:24+05:30 IST