
ప్రకాశం: సీఎం జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీటీడీ ఛైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరినీ పైకి తీసుకువచ్చి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి పని చేసిన వారికే సీఎం జగన్ పదవులు ఇస్తారని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారని, 2,3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం జరిగిందని చెప్పారు. కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి.. సాధారణ పిండి పదార్థాలు సరఫరా చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల్లో సామాన్య భక్తులకు దర్శనం దొరక్క గొడవలు జరిగిన ఘటనలు ఉన్నాయని సుబ్బారెడ్డి గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి