బిగ్‌‌బాస్‌ తెలుగు సిజన్‌ 6: కంటెస్టెంట్‌గా యంగ్ ‘వకీల్‌ సాబ్‌’?

Published: Mon, 27 Jun 2022 21:34:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బిగ్‌‌బాస్‌ తెలుగు సిజన్‌ 6: కంటెస్టెంట్‌గా యంగ్ వకీల్‌ సాబ్‌?

బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో మొట్టమొదటిసారిగా బిగ్‌బాస్ హౌస్‌ (Bigg Boss House)లోకి ఓ యంగ్ వకీల్‌ సాబ్‌ ఎంటర్‌ కాబోతున్నట్లుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చక్కర్లు కొడుతున్న వార్తల వెనుక ఉన్న ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ఎవరో తెలుసా? ఖమ్మం జిల్లా వాసి, తెలంగాణ స్టేట్ హై కోర్ట్ అడ్వకేట్ సుబ్బు సింగపోగు (subbu singapogu). ఆయనకి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగు బిగ్‌‌బాస్‌ సీజన్ 6 జూలై నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. సీజన్‌ 6లోకి సుబ్బుకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అడ్వకేట్ అయిన సుబ్బు సోషల్ మీడియాలో సామాజిక అంశాలపైన చాలా యాక్టీవ్‌గా ఉంటుంటారు. ముఖ్యంగా ఆయనకు పేదల అడ్వకేట్ అనే పేరు కూడా ఉంది. ఎంతో మంది పేదల తరపున వకాల్తా పుచ్చుకొని కొన్ని వందల కేసులను ఉచితంగా వాదించి విజయం సాధించినట్లుగా ఆయన గురించి చెబుతుంటారు.


అంతే కాక, భర్తలు చనిపోయిన స్త్రీలకు, ఒంటరి మహిళలకు సంబంధించిన కొన్ని వందల కేసులను ఉచితంగా వాదించి వారికి అండగా సుబ్బు సింగపోగు నిలిచినట్లుగా కూడా టాక్ నడుస్తుంది. అందుకే ఆయన బిగ్‌బాస్ దృష్టిలో పడి ఉంటాడని అనుకుంటున్నారు. సుబ్బు విషయానికి వస్తే రంగస్థల నటుడిగా కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చిన ఆయన.. వెండితెరపై కూడా తన ప్రతిభను చాటుకునే పనిలో ఉన్నారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లాకి చెందిన సత్తుపల్లి మండలంలోని సిద్ధార్థ గ్రామం. కొంతకాలంగా ఆయన హైదరాబాదులోనే నివాసముంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాద విద్యను పూర్తి చేసిన సుబ్బు త్వరలో విడుదల కానున్న ప్రధాన చిత్రాల్లో నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట. ప్రస్తుతానికైతే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్‌లో సుబ్బు సింగపోగు పేరు ఉందనేలా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International