కలిసొచ్చిన పార్ట్‌నర్‌షిప్ వ్యవహారం.. 10శాతం లాభపడిన Subex Ltd

ABN , First Publish Date - 2022-08-05T18:32:07+05:30 IST

AI ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫారమ్(AI Orchestration Platform), హైపర్‌సెన్స్(HyperSense), జియో ప్లాట్‌ఫారమ్‌(Jio Platform)లతో

కలిసొచ్చిన పార్ట్‌నర్‌షిప్ వ్యవహారం.. 10శాతం లాభపడిన Subex Ltd

Subex Ltd Shares : AI ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫారమ్(AI Orchestration Platform), హైపర్‌సెన్స్(HyperSense), జియో ప్లాట్‌ఫారమ్‌(Jio Platform)లతో సుబెక్స్ లిమిటెడ్(Subex Ltd) తన పార్ట్‌నర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ పార్ట్‌నర్ షిప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం వ్యాపారా(Reliance Industries telecom business)నికి సంబంధించిన 5G ప్రొడక్ట్ లైన్‌ను పెంచుతుంది. ఈ పార్ట్‌నర్‌షిప్ గురించి ప్రకటించడంతో నేడు సుబెక్స్ షేర్లు మాంచి జోష్‌మీదున్నాయి.


ఈరోజు వరుసగా మూడవ సెషన్‌లో సుబెక్స్ లిమిటెడ్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో లాక్ చేయబడ్డాయి. బీఎస్‌ఈలో క్రితం ముగింపు రూ.39.95 నుంచి సుబెక్స్ స్టాక్ ప్రారంభ ట్రేడింగ్‌లో 10 శాతం పెరిగి రూ.43.90కి చేరుకుంది. భాగస్వామ్య వార్తలు ప్రకటించిన ఆగస్టు 2 ముగింపు నుంచి స్టాక్ 58 శాతానికి పైగా పెరిగింది. ఆగస్టు 2న రూ. 27.70 వద్ద ముగిసిన ఈ షేరు ఈరోజు రూ. 43.90కి పెరిగింది. ఈ కాలంలో 58.48 శాతం లాభపడింది.


సుబెక్స్ టెలికాం పరిశ్రమలో కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు సేవలను అందిస్తోంది. దీని విభాగాలలో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు(software products), సాఫ్ట్‌వేర్ సంబంధిత సేవలు(software-related services) ఉన్నాయి. కంపెనీ హైపర్‌సెన్స్(HyperSense), బిజినెస్ అస్యూరెన్స్(Business Assurance), ఫ్రాడ్ మేనేజ్‌మెంట్(Fraud Management), నెట్‌వర్క్ అసెట్ మేనేజ్‌మెంట్(Network Asset Management), కెపాసిటీ మేనేజ్‌మెంట్(Capacity Management), పార్టనర్ ఎకోసిస్టమ్(Partner Ecosystem) మేనేజ్‌మెంట్(Management), అనలిటిక్స్ సెంటర్ ఆఫ్ ట్రస్ట్ (ACT), సుబెక్స్ సెక్యూర్, IDcentral వంటి ఉత్పత్తులు, సేవలను అందిస్తోంది.




Updated Date - 2022-08-05T18:32:07+05:30 IST