యువతకు ఆదర్శం సుభాష్‌చంద్రబోస్‌

ABN , First Publish Date - 2021-01-24T05:48:06+05:30 IST

దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ చేసిన పోరాటాలు, త్యాగాలు యువతకు ఆదర్శమని ఎమ్మె ల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు.

యువతకు ఆదర్శం సుభాష్‌చంద్రబోస్‌
సుభాష్‌చంద్రబోస్‌కు నివాళులర్పిస్తున్న శ్రీధర్‌బాబు

- ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు  

- ఘనంగా నేతాజీ జయంతి

మంథని, జనవరి 23: దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ చేసిన పోరాటాలు, త్యాగాలు యువతకు ఆదర్శమని ఎమ్మె ల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. స్థానిక ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుభాష్‌చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీధర్‌బాబు శనివారం పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కాం గ్రెస్‌ నేతలు శశిభూషణ్‌కాచే, సెగ్గెం రాజేష్‌, కౌన్సిలర్లు పెండ్రి రమాదేవీ-సురేష్‌రెడ్డి, చొప్పకట్ల హన్ముంతు, గోటికార్‌ కిషన్‌జీ, పోలు శివ, మంథని సురేష్‌, వేణులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T05:48:06+05:30 IST