బాలీవుడ్‌లో సుబ్రతారాయ్‌ బయోపిక్‌

Jun 6 2021 @ 00:00AM

వ్యాపార దిగ్గజం సహారా గ్రూప్‌ సంస్థల అధిపతి సుబ్రతారాయ్‌ జీవిత కథతో బాలీవుడ్‌ లో ఓ చిత్రం తెరకెక్కనుంది. జూన్‌ 10న ఆయన పుట్టిన రోజున అధికారికంగా ఈ  సినిమాను ప్రకటించనున్నారు. దర్శకుడు, నటీన టుల వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించిన ‘బ్యాడ్‌ బాయ్స్‌’ డాక్యుమెంటరీ సిరీస్‌లో సుబ్రతారాయ్‌ జీవిత కథతో ఓ భాగాన్ని తెరకెక్కించగా దానిపై వివాదాలు వచ్చాయి. సుబ్రతారాయ్‌పై ఇన్వెస్టర్ల సొమ్ము కాజేశారనే  కేసు కోర్టులో నడుస్తోంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.