సబ్సిడీ గ్యాస్‌ పక్కదారి

ABN , First Publish Date - 2021-01-14T05:23:19+05:30 IST

పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే రాయితీ వంటగ్యాస్‌ అక్రమార్కులకు కాసులు కురిపి స్తోంది. సబ్సిడీ గ్యాస్‌ను కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిండర్లలో నింపుతూ, వాహనాలకు గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చేస్తూ పెద్ద దందా సాగిస్తున్నారు.

సబ్సిడీ గ్యాస్‌ పక్కదారి

జిల్లాలో జోరుగా గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌
 సబ్సిడీ సిలిండర్లతో దందా
మినీ సిలిండర్ల ద్వారా సబ్సిడీ గ్యాస్‌ సరఫరా     
కామారెడ్డి టౌన్‌, జనవరి 13: పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే రాయితీ వంటగ్యాస్‌ అక్రమార్కులకు కాసులు కురిపి స్తోంది. సబ్సిడీ గ్యాస్‌ను కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిండర్లలో నింపుతూ, వాహనాలకు గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చేస్తూ పెద్ద దందా సాగిస్తున్నారు. సబ్సిడీ సిలిండర్లను కొంత మంది బ్లాక్‌లో కొనుగోలు చేసి అందులోని ఇంధనాన్ని మినీ సిలిండర్లలో నింపి విక్రయిస్తున్నారు. రీఫిల్లింగ్‌ ద్వారా ఒక్కో సిలిండర్‌కు అదనంగా రూ.వెయ్యి సంపాదిస్తున్నారు. మినీ సిలి ండర్ల అక్రమ దందా యథేచ్ఛగా సాగిస్తూ ప్రభుత్వ నిబంధన లు పట్టని హోం నీడ్స్‌ దుకాణాల నిర్వాహకులు మినీ సిలిండర్‌ సైజ్‌ను బట్టి డబ్బులు గుంజుతున్నారు. ఇదిలా ఉంటే మరికొం దరు వాహనాలకు సబ్సిడీ గ్యాస్‌నే వినియోగిస్తున్నారు. వీరికి గ్యాస్‌ ఏజెన్సీల డెలివరి బాయ్‌లే ప్రధాన సరఫరాదారులుగా మారుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పట్టణ కేంద్రాల్లో జోరుగా సబ్సిడీ గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడి పట్టణ కేంద్రా ల్లో సబ్సిడీ గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ దందా జోరుగా సాగుతుందని తె లుస్తోంది. జనావాసాల నడుమ అక్రమదందా నడుస్తుండడం తో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళ న చెందుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని పలు గ్యాస్‌ ఏజెన్సీలలో ఆటోల ద్వారా గ్యాస్‌ డెలివరీ చేసే వ్యక్తులు అక్ర మార్జనకు తెరలేపి సబ్సిడీ గ్యాస్‌ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. గ్యాస్‌ డెలివరీ సమయంలో వినియో గదారులకు అవసరాల నిమిత్తం సిలిండర్లను అందిస్తూ వారిని మచ్చిక చేసుకుని వారి పేరుమీద వచ్చిన సబ్సిడీ గ్యాస్‌ను వీరు రీ ఫిల్లింగ్‌ చేసే వారికి లేకుంటే గ్యాస్‌ వాహనాలు నడిపే వారికి విక్రయిస్తున్నారని తెలుస్తోంది. వీరి అక్రమాలపై నిఘా పెట్టి నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు నెలవారీగా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామ మాత్ర ంగా కేసులు పెడుతూ తర్వాత దందా నడిచేలా పరోక్షంగా సహకరిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. ముందుగా గ్యాస్‌ డెలివరి వ్యక్తులపై పూర్తిస్థాయిలో నిఘాపెట్టి అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అంతా బహిరంగమే..
పట్టణ, మండల కేంద్రాలకు హోంనీడ్స్‌ దుకాణాల వారు, వాహనాల్లో గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చేసే వారు అంతా బహిరంగం గానే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల నుంచి చిన్న సిలిండర్లు కొనుగోలు చేసి ఇక్కడకు తెచ్చి వ్యాపారం చేస్తున్నారు. గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చేసే వారు ముందుగా గ్యాస్‌ డెలివరి వ్యక్తులకు అడ్రస్‌ చెప్పి వారి వద్ద గ్యాస్‌ను డెలివరి చేయించి ఆ తర్వాత వాహనాల్లో గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, ఉన్నత చదువుల కోసం వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రా నికి వస్తున్న యువకులు, విద్యార్థులు మినీ సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీరి అవసరాలను అక్రమా ర్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.766 ఉన్న రాయితీ గ్యాస్‌ను వినియోగదారుల నుంచి రూ.900ల నుంచి రూ.1000కి కొనుగోలు చేస్తూ 3 లేదా 4 సిలిండర్లలో నింపుతూ వెయ్యి అదనంగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది.
జనావాసాల మధ్య వ్యాపారం
జనావాసాల మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. మినీ సిలిండర్లు వాడడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. రీ ఫిల్లింగ్‌ చేసే సమయంలో ఏదై న అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ందే. ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలిసినా సీరియస్‌గా తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనావాసాల మధ్య కార్లలో గ్యాస్‌ నింపే దందా కూడా ఎక్కువ గా సాగుతోంది. ప్రభుత్వం ఆమోదం పొందిన పలు గ్యాస్‌ కంపెనీలు మార్కెట్లో 5కిలోల సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. వీటిని వినియోగించేందుకు జనం ఆసక్తి చూపడంలేదు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కేంద్రంతో పాటు పట్టణ, మండల కేంద్రాల్లో గ్యాస్‌ సరఫరా చేస్తున్న డెలివరి బాయ్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచితే సబ్సిడీ గ్యాస్‌ పక్కదారి పట్టకుండా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-01-14T05:23:19+05:30 IST