సబ్సిడీ ఆనవాయితీకి మంగళం

ABN , First Publish Date - 2020-11-22T06:11:34+05:30 IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులను తక్కువ ధరలకే అందిస్తామని, ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యరూపం దాల్చటం లేదు.

సబ్సిడీ ఆనవాయితీకి మంగళం

తోట్లవల్లూరు, నవంబరు 21 : రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులను తక్కువ ధరలకే అందిస్తామని, ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యరూపం దాల్చటం లేదు. ఖరీప్‌ వరికోతలు కోసే రైతులు మినుము, పెసర విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాలు, పీఏసీఎస్‌ల వద్దకు వెళ్లి నిరాశతో వెనుతిరిగి వెళుతున్నారు. ముందుగా డబ్బులు చెల్లిస్తే సరఫరా చేస్తామని సిబ్బంది చెపుతున్నారు. డబ్బులు చెల్లిస్తే వారం రోజులకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈలోపు పొలంలో తేమ ఆరిపోతే విత్తనాలు చల్లటం కుదరదు. అందుచేత ప్రైవేటు వ్యక్తుల వద్ద కిలో విత్తనాలను రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నామని రైతులు చెపుతున్నారు. గతంలో వ్యవసాయశాఖ ముందుగానే విత్తనాలను తెచ్చి పీఏసీఎస్‌లలో 50 శాతం సబ్సీడీపై రైతులుకు అందించే వారు. కిలో రూ.50కే లభించేవి. ఒకవైపు ఎకరం వరికోత రూ.3,500 ఉండేది ఏకంగా రూ.6వేలకు చేరటం, మరోపైవు సబ్సిడీ విత్తనాలు అందించకపోవటం రైతులకు అదనపు భారం అవుతోంది. దీనిపె మండల వ్యవసాయాధికారిణి శోభారాణి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు కావలసిన రైతులు ముందుగా డబ్బులు చెల్లిస్తే సరఫరా చేస్తారని, కాని ముందుగా డబ్బులు చెల్లించేందుకు రైతులు ముందుకు రావటం లేదని సమాధానమిచ్చారు.  

Updated Date - 2020-11-22T06:11:34+05:30 IST