ప్రతీ పనిలో విజయం సాధించాలి : సీపీ శ్వేత

ABN , First Publish Date - 2022-10-07T04:44:11+05:30 IST

పోలీసు అధికారులు, సిబ్బంది చేసే ప్రతీ పనిలో విజయం సాధించాలని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ శ్వేత ఆకాంక్షించారు.

ప్రతీ పనిలో విజయం సాధించాలి : సీపీ శ్వేత
జమ్మి చెట్టుకు పూజ చేస్తున్న పోలీసు కమిషనర్‌ శ్వేత

చిన్నకోడూరు, అక్టోబరు 6 : పోలీసు అధికారులు, సిబ్బంది చేసే ప్రతీ పనిలో విజయం సాధించాలని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ శ్వేత ఆకాంక్షించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు శివారులోని సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ సాయుధ దళాల కార్యాలయంలో ఆయుఽధాలకు, ప్రభుత్వ వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజచేసి, జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, ఏఆర్‌ అదనపు డీసీపీలు రామచంద్రరావు, సుభా్‌షచంద్రబోస్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, రామకృష్ణ, ధరణికుమార్‌, ఆర్‌ఎ్‌సఐలు రోహిత్‌, సురేష్‌, సాయిచరణ్‌, మహిళా ఆర్‌ఎ్‌సఐ పుష్ప, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T04:44:11+05:30 IST