గుడిలో ఇచ్చిన తీర్థంతోపాటు పొరపాటున కృష్ణుడి విగ్రహాన్ని కూడా మింగేసిన భక్తుడు.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూస్తే..

ABN , First Publish Date - 2022-06-25T01:27:30+05:30 IST

భక్తిశ్రద్దలతో పూజ చేయడంలో నిమగ్నమైపోయిన ఓ భక్తుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

గుడిలో ఇచ్చిన తీర్థంతోపాటు పొరపాటున కృష్ణుడి విగ్రహాన్ని కూడా మింగేసిన భక్తుడు.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూస్తే..

భక్తిశ్రద్దలతో పూజ చేయడంలో నిమగ్నమైపోయిన ఓ భక్తుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పూజ ధ్యాసలో మునిగిపోయి తీర్థంతోపాటు బాలకృష్ణుడి విగ్రహాన్ని కూడా మింగేశాడు. చివరకు ఆస్పత్రి పాలయ్యాడు. వైద్యులు శస్త్రచికిత్స చేసి గొంతులో ఇరుక్కున్న విగ్రహాన్ని ఎంతో కష్టపడి బయటకు తీశారు. బెళగావికి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి రోజూ తన ఆరాధ్య దైవం బాలకృష్ణుడ్ని పూజించేవాడు. 


ఇది కూడా చదవండి..

కాబోయే అత్త ప్రవర్తన నచ్చలేదట.. ప్రేమించిన వాడితో పెళ్లిని రద్దు చేసుకున్న యువతి కథ ఇదీ..!


ఒకరోజు పూజ తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు పంచామృతంలో ఉన్న బాలకృష్ణుడి విగ్రహాన్ని మింగేశాడు. అలా మింగేసినట్టు కూడా అతడికి తెలియలేదు. గొంతులో విపరీతమైన నొప్పి, వాపు రావడంతో చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ ఎక్స్‌రే తీసి చూసి గొంతులో కృష్ణుడి విగ్రహం ఇరుక్కుపోయిందని తేల్చారు. ఆహార నాళికలో ఎడమవైపు కృష్ణుడి విగ్రహం ఇరుక్కుపోయిందని ఎండోస్కోపీ ద్వారా నిర్ధారించుకుని ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. ఆపరేషన్ చేసి గొంతులో ఉన్న కృష్ణుడి ప్రతిమను బయటకు తీశారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-06-25T01:27:30+05:30 IST