విజయవంతంగా కొవిడ్‌ టీకా

ABN , First Publish Date - 2021-01-17T05:18:05+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావా లు లేవని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు.

విజయవంతంగా కొవిడ్‌ టీకా
పెద్దపల్లిలో డాక్టర్‌ మందల వాసుదేవరెడ్డికి టీకా వేస్తున్న నర్సు

- తొలిరోజు నాలుగు కేంద్రాల్లో 90 మందికి వ్యాక్సిన్‌  

- రేపటి నుంచి అన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

పెద్దపల్లి టౌన్‌, జనవరి 16 : కొవిడ్‌ వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావా లు లేవని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శనివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. తొలుత ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మందల వాసుదేవారెడ్డికి వ్యాక్సిన్‌ వేయించిన అనంతరం పుట్ట మధు మాట్లాడారు. ఎన్నో రోజులు వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నార న్నారు. ఇప్పుడు హెల్త్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేసిన తరువాత అందరికి అం దుబాటులోకి వస్తుందన్నారు. వ్యాక్సిన్‌ వేసిన తరువాత అరగంట ఆబ్జర్వే షన్లో ఉంటే సరిపోతుందన్నారు. వైద్యశాఖ సూచించిన సూచనల ప్రకా రం వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌ ఉన్నా చికిత్సతో నయం చేయవచ్చన్నారు. మొదటిసారి వ్యాక్సిన్‌ వేసుకున్న తరువాత 25 రోజులకు మరో డోస్‌ వేసుకోవాలని సూచించారు. జిల్లా ప్రధానాస్పత్రిలో 30 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా, 20మందికి హెల్త్‌వర్కర్ల కు మాత్రమే వేశారు. జ్వరం, పాజిటివ్‌, బాలింతలు, గర్భవతులు, వివిధ కారణాలతో మిగతా వారికి కరోనా వ్యాక్సిన్‌ వేయలేదని మందల వాసుదే వారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి మొదటివారంలో అందరికి టీకాలు వేయను న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిరెడ్డి మమ తారెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారి ప్రమోద్‌ కుమార్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:18:05+05:30 IST