చాణక్య నీతి: అలాంటి వ్యక్తులు పాముల కంటే ప్రమాదకరం.. వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి!

ABN , First Publish Date - 2022-02-08T12:02:13+05:30 IST

ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాల గురించి..

చాణక్య నీతి: అలాంటి వ్యక్తులు పాముల కంటే ప్రమాదకరం.. వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి!

ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాల గురించి ఎంత  చెప్పినా తక్కువే .. చాణక్యుని వాక్యాలు శిలా శాసనాలుగా రుజువయ్యాయి. ఆచార్య చాణక్య ఒక గొప్ప వ్యూహకర్త, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్య అన్ని కాలాలకు ఉపయుక్తమయ్యే కార్యాచరణ విధానాల గురించి తెలియజెప్పారు. వైవాహిక జీవితం, స్నేహం తదితర సంబంధాల గురించి చాణక్యుడు తన విధానాలలో పేర్కొన్నారు. ఆచార్య చాణక్య.. మనిషి స్వభావం గురించి చక్కగా తేల్చిచెప్పారు. ఎటువంటి అలవాట్లు అలవరచుకోవడం ద్వారా సులభంగా విజయం సాధించవచ్చో తన విధానాలలో తెలియజేశారు. ఆచార్య చాణక్య శ్లోకాల ద్వారా ప్రతి ఒక్కరికీ జీవన విధానాలను వివరించడానికి ప్రయత్నించారు. మీరు విజయవంతమైన జీవితం గడుపుతూ సంతోషంగా ఉండాలనుకుంటే, మీరు ఎలాంటివారితో స్నేహం చేయాలో ఎవరికి దూరంగా ఉండాలో ఆచార్య చాణక్య తెలిపారు. ఆచార్య చాణక్య కొందరిని పాముతో పోల్చారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.




దుర్జనస్య చ సర్పస్య వరం సర్పో న దుర్జనః । 

సర్పో దంషతి కాలే తు దుర్జనస్తు పదె పదె।।

ఈ శ్లోకంలో ఆచార్య చాణక్య పాముకి, దుష్టునికిగల అంతరం గురించి వివరించారు. పాము తనకు ప్రాణ హాని కలుగుతుందని అనుకున్నప్పుడే అది కాటు వేస్తుంది. అదే దుష్టుడయితే మీకు అడుగడుగునా ప్రాణహాని కల్పించేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే అలాంటివారికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు. అలాంటివారిని అస్సలు నమ్మకూడదని ఆచార్య తెలిపారు. సుఖదుఖాలలో మనకు అండగా నిలిచేవారితోనే స్నేహం చేయాలని, అటువంటివారినే మిత్రులుగా ఎన్నుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. పొరపాటున అయినా దుష్టునితో స్నేహం చేస్తే, అటువంటివారు ఎప్పుడైనా సరే హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తారని ఆచార్య చాణక్య హెచ్చరించారు.

Updated Date - 2022-02-08T12:02:13+05:30 IST