ప్లకార్డు చేతబట్టి వరుడ్ని వెతుక్కునే పనిలో యువతి.. అలాంటి వ్యక్తి అయినా ఆమెకు ఓకేనట.. తన Phone Number కూడా చెప్పేసింది!

Published: Mon, 16 May 2022 08:45:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్లకార్డు చేతబట్టి వరుడ్ని వెతుక్కునే పనిలో యువతి.. అలాంటి వ్యక్తి అయినా ఆమెకు ఓకేనట.. తన Phone Number కూడా చెప్పేసింది!

ఇంటర్నెట్ డెస్క్: ఓ ప్లకార్డు పట్టుకున్న నిల్చున్న యువతి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇంతకూ ఎవరు ఆ మహిళ? ప్లకార్డు ద్వారా ఆమె చెబుతోంది? నెటిజన్లు ఎందుకు అంతగా ఆశ్చర్యపోతున్నారు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


‘నేను ఇలాంటి అమ్మాయిని భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ లక్షణాలు మీలో ఉంటే సంప్రదించవచ్చు’ అంటూ ప్రపంచ వ్యాప్తంగా కొందరు యువతులు రకరకాల పద్ధతుల్లో ప్రకటనలు చేశారు. అందుకు సంబంధించిన వార్తలను కూడా మనం చూశాం. కానీ  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ ఏ యువతీ.. ‘నాకు భర్త కావాలి’ అంటూ రోడ్డు ఎక్కిన సంఘటనలు ఎక్కడా చూసి ఉండరు. అయితే సుడాన్‌(Sudan)కు చెందిన ఓ యువతి మాత్రం ప్రస్తుతం ఈ పని చేసి వార్తల్లో నిలిచింది.


నల్లటి మాస్కు ధరించిన ఓ యువతి.. ప్లకార్డు ద్వారా వరుడ్ని వెతుక్కునే పనిలో పడింది. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వరుడు కావాలి. గతంలో పెళ్లి అయిన వ్యక్తిని చేసుకోవడానికి కూడా సిద్ధమే’ అనే వ్యాఖ్యాలతో కూడిన ప్లకార్డును చేతిలో పట్టుకుని రోడ్డుపై సూడాన్‌ రోడ్లపై తిరుగుతోంది. అంతేకాదు.. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు సంప్రదించొచ్చు పేర్కొంటూ తన ఫోన్ నెంబర్‌ను కూడా ప్లకార్డుపై రాసింది. కాగా.. ఆ యువతికి సంబంధించిన ఫొటోను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 


ఇదిలా ఉంటే.. 2018-20 మధ్య సూడాన్‌లో మ్యారెజ్‌ల రేటు గణనీయంగా తగ్గింది. 2018తో పోల్చితే 2020 సంవత్సరంలో marriage rate 21శాతం పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 2020లో 60వేలకుపైగా జంటలు విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి కరోనా మహమ్మారే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.