WorldNoTobaccoDay: సిగరెట్లు కాల్చకండి.. హెల్త్‌లు పాడైపోతాయ్ అంటే వినరుగా.. పోనీ ఇది చూసైనా..

ABN , First Publish Date - 2022-06-01T00:54:03+05:30 IST

‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని సినిమా థియేటర్లలో Disclaimer వేసినా, సిగరెట్ ప్యాకెట్లపై భయపెట్టే రీతిలో గొంతు క్యాన్సర్ బాధితుల బొమ్మలు వేసినా..

WorldNoTobaccoDay: సిగరెట్లు కాల్చకండి.. హెల్త్‌లు పాడైపోతాయ్ అంటే వినరుగా.. పోనీ ఇది చూసైనా..

‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని సినిమా థియేటర్లలో Disclaimer వేసినా, సిగరెట్ ప్యాకెట్లపై భయపెట్టే రీతిలో గొంతు క్యాన్సర్ బాధితుల బొమ్మలు వేసినా స్మోకర్స్ మాత్రం ‘తగ్గేదే లే’ అంటున్నారు. ఫలితంగా దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడి ఊపిరితిత్తుల సంబంధ సమస్యలతో, గొంతు క్యాన్సర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నేడు WorldNoTobaccoDay కావడంతో ధూమపానం వల్ల కలిగే నష్టాలను, ధూమపానం దేహాన్ని అంపశయ్యపై ఎలా పడుకోబెడుతుందో వివరిస్తూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో సైకత శిల్పాన్ని రూపొందించారు.



ఒక కాలుతున్న సిగరెట్‌ను రూపొందించి ఆ సిగరెట్‌పై WORLD NO TOBACCO DAY అని రాశారు. దాని పక్కనే కాల్చేసిన సిగరెట్లతో చితిని పేర్చి ఆ చితిపై మనిషి ఎముకల గూడును ఉంచాడు. ధూమపానం కారణంగా మనిషి దేహం అలా మంటల్లో కాలిపోతుందని, జీవితం తగలబడిపోతుందని సుదర్శన్ పట్నాయక్ ఈ సైకత శిల్పాన్ని రూపొందించి సింబాలిక్‌గా చెప్పాడు. ఈ సైకత శిల్పం ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేసేలా కూడా ఉండటం విశేషం. సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాలు ఎంతలా ప్రాచుర్యం పొందాయో అందరికీ తెలిసిందే. పొగాకు వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. ప్రతీ ఏటా కొన్ని లక్షల ప్రాణాలు ధూమపానం కారణంగా గాల్లో కలిసిపోతున్నాయి.


ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా ప్రజలు పొగాకు వాడకంతో మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి మంగళవారం ప్రపంచ నిరోధక దినోత్సవం సందర్భంగా తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం పర్యావరణంపై కూడా వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. పొగాకు వల్ల మీరు ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని యూఎన్ పేర్కొంది. ధూమపానం, పొగాకు వినియోగం వల్ల గుండె జబ్బులు వస్తాయని నిపుణులు చెప్పారు. సిగరెట్ లేదా హుక్కా తాగడం వల్ల గర్భధారణ సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెపుతున్నారు. మహారాష్ట్రలో ఎక్కువ మంది పొగాకు వినియోగదారులు ఉన్నారని సర్వేలో తేలింది. దశాబ్దం క్రితం కంటే 7 రెట్లు ఎక్కువ యూపీలో 44.1శాతం మంది పురుషులు, 8.4శాతం మంది స్త్రీలు, 15 ఏళ్లు పైబడిన వారు పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

Updated Date - 2022-06-01T00:54:03+05:30 IST