
హైదరాబాద్ సిటీ/అబ్దుల్లాపూర్‌మెట్ : నగర శివారు విజయవాడ జాతీయ రహదారిపై సడన్ బ్రేక్ వేయగా ఎనిమిది కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. నాగోల్‌లోని సమతాపురికాలనీ సాయు రెసిడెన్సీకి చెందిన వెంకటశైలేంద్రకుమార్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మారుతి బెలినో కారులో హైదరాబాద్‌కు వస్తున్నాడు. కారు పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగు రోడ్డు సమీపం వద్దకు రాగానే ముందు వెళ్తున్న కార్ల డ్రైవర్లు సడన్‌గా బ్రేకులు వేశారు. శైలేంద్రకుమార్ కారు ముందు ఉన్న కారును ఢీకొట్టింది. అతడి వెనుకలా వస్తున్న కార్లు ముందున్న కార్లను ఒకదానినొకటి ఢీకొట్టాయి. మొత్తం 8 కార్లు ఢీకొన్నాయి. కార్ల ముందు, వెనుక భాగాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.