Narayana అరెస్ట్ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. సడన్‌గా ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2022-05-10T19:45:33+05:30 IST

Narayana అరెస్ట్ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. సడన్‌గా ఎందుకిలా..!?

Narayana అరెస్ట్ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. సడన్‌గా ఎందుకిలా..!?

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు. ముందుగా టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీ విషయంలో అరెస్ట్ చేశామని చెప్పిన సీఐడీ అధికారులు.. తెలంగాణ బార్డర్ దాటాక ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. ఏపీ రాజధాని భూముల స్కాం కేసులో కూడా (Amaravati Land Pooling Scam) నారాయణను అరెస్ట్‌ చేశామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి FIR కాపీని కూడా అధికారులు చూపిస్తున్నారు. అంతేకాదు మొదట సీఐడీ అని చెప్పకుండా చిత్తూరు జిల్లా పోలీసులమని చెప్పి ఆ తర్వాత సడన్‌గా ఇలా చెప్పడం గమనార్హం.


పూర్వ పరాలివీ..

అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగినట్లు ఇది వరకే ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్ననే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్‌, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్‌, ఏ6గా హెరిటేజ్‌ ఫుడ్స్‌‌ను చేర్చారు. వీరందరిపైనా సెక్షన్లు 120బీ, 420, 34, 35, 36, 37, 166 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌: 16/2022. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు చేసింది మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే. మొదట్నుంచీ అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఈయనే ఫిర్యాదులు చేయడం.. కోర్టులకు వెళ్లడం గట్రా చేస్తున్నారు.


ఫిర్యాదులో ఏముంది..!?

స్వప్రయోజనాల కోసం రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపణలు వస్తున్నాయి. అలైన్‌మెంట్‌ మార్పుతో రామకృష్ణ హౌసింగ్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, LEPL ప్రాజెక్ట్స్‌, లింగమనేని అగ్రికల్చర్‌ ఫామ్స్‌, జయని ఎస్టేట్స్‌కు లబ్ధి కలిగించారని ఆరోపణలూ ఉన్నాయి. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు పొడవు 454 కిలోమీటర్లు కేంద్రం అనుమతితో అన్ని ప్రాంతాలను కలిపేలా ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వేశారని ఫిర్యాదులో వైసీపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజధానికి వెలుపల లింగమనేని, హెరిటేజ్‌, జయని ఇన్‌ఫ్రా భూములు, గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు దగ్గర హెరిటేజ్‌ భూములు రాజధాని ప్రకటనకు ఐదేళ్ల ముందే భూముల కొనుగోళ్లు చేశారనే ఆరోపణలను కూడా ఆళ్ల ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Read more