పుట్టింట్లో ఉన్న భార్యను బతిమాలి తీసుకెళ్లిన భర్త.. కొన్నాళ్ల తర్వాత ఉన్నట్టుండి ఆమె అదృశ్యం.. చివరికి విషయం తెలిసి అంతా షాక్..

ABN , First Publish Date - 2021-11-13T23:38:32+05:30 IST

మహారాష్ట్ర పాల్గర్‌కు చెందిన ఆర్తి అధికారి(33) అనే మహిళకు, ఖరేకురన్ గ్రామానికి చెందిన మనీష్ పటేల్‌కు 2019లో వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు.

పుట్టింట్లో ఉన్న భార్యను బతిమాలి తీసుకెళ్లిన భర్త.. కొన్నాళ్ల తర్వాత ఉన్నట్టుండి ఆమె అదృశ్యం.. చివరికి విషయం తెలిసి అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

సంసారంలో అలకలు సహజమే. భర్త మీద అలిగినప్పుడు భార్య పుట్టింటికి వెళ్లడం, భర్త బుజ్జగించి తీసుకురావడం.. సాధారణంగానే జరుగుతుంటుంది. మహారాష్ట్రలో మాత్రం చాలా దారుణం జరిగింది. భర్త మీద కోపంతో భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో భర్త పుట్టింటికి వెళ్లి.. ఇక సమస్యలు ఉండవని నచ్చజెప్పి భార్యను తీసుకొచ్చాడు. అయితే తర్వాత వారి కుటుంబంలో జరిగిన ఘటనతో స్థానికులంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్ర పాల్గర్‌కు చెందిన ఆర్తి అధికారి(33) అనే మహిళకు, ఖరేకురన్ గ్రామానికి చెందిన మనీష్ పటేల్‌కు 2019లో వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. వారి సంసారం కొన్నాళ్లు బాగా నడిచింది. అయితే తర్వాత అసలు సమస్య మొదలైంది. భర్త నుంచి ఓ వైపు, అత్త నుంచి మరోవైపు సమస్యలు రావడం మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని రోజూ వేధించేవారు. దీనికితోడు భర్త శారీరకంగా వేధించేవాడు. ఎన్ని సమస్యలు ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకుండా అన్నీ భరించింది. అయితే రోజురోజుకూ వేధింపులు ఎక్కవయ్యాయి. దీంతో భరించలేని ఆమె.. తన పుట్టింటికి వెళ్లింది.


పాల్గర్‌లో తల్లిదండ్రులతో ఉంటున్న భార్యను తీసుకురావడానికి.. కొన్నాళ్ల తర్వాత భర్త వెళ్లాడు. ఇకమీదట ఇబ్బందులు ఉండవని, బాగా చూసుకుంటానని అత్తమామలకు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన వారు.. కుమార్తెను అత్తవారింటికి పంపించారు. అక్కడికి వెళ్లాక కోడిలిని బాగా చూసుకున్నారు. కొన్ని నెలలు గడవగానే మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. గతంలో మాదిరే మళ్లీ కట్నం పేరుతో చిత్రహింసలు పెట్టడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 5న ఉన్నట్టుండి ఆమె కనిపించకుండా పోయింది.  విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు వెతకడం మొదలెట్టారు. అయితే ఎంత వెతికినా ఆమె జాడ మాత్రం దొరకలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.


నవంబర్ 8న సాయంత్రం ఖరేకురన్ గ్రామ సమీపంలోని పొలాల్లో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె తలపై రాళ్లతో బలంగా కొట్టినట్లు ఆనవాళ్లను గుర్తించారు. అక్కడికి చేరుకున్న ఆర్తి తల్లిదండ్రులు బోరున విలపించారు. భర్త, అత్తమామలే తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు.. అనుమానితుడిగా భావించిన తేజ అనే యువకుడిని, ఆర్తి భర్త, అత్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-11-13T23:38:32+05:30 IST