Chronic Back Pain : దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారా? దాని నుంచి ఇలా బయటపడండి.

ABN , First Publish Date - 2022-09-01T18:03:29+05:30 IST

ఇప్పటి రోజుల్లో వెన్నునొప్పి వయసు బేధం లేకుండా అందరిలో కనిపిస్తున్న సమస్య.

Chronic Back Pain : దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారా? దాని నుంచి ఇలా బయటపడండి.

ఇప్పటి రోజుల్లో వెన్నునొప్పి వయసు బేధం లేకుండా అందరిలో కనిపిస్తున్న సమస్య. రోజువారి పని వేళలు, కూర్చోవడంలో, నిద్రలో సరైన భంగిమ లేకపోవడం, బరువైన పనులు చేయడం ఇలా వెన్ను మీద పడే ఒత్తిడి కారణంగా ఎన్ని మందులు వాడినా నడుం నొప్పి తగ్గదు. అయితే వైద్య నివేదికలు, పరిశోధనలు ఈ ధీర్ఘకాలిక నడుం నొప్పి నివారించడానికి మార్గాలు సూచిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. 


1. వెన్ను నొప్పి సాధారణ అనారోగ్య సమస్యల్లో ఒకటి.

ప్రపంచ వ్యాప్తంగా పని ఒత్తడి, ఎక్కువ పని వేళలు కారణంగా వెన్ను నొప్పితో బాధపడేవారు ఎక్కువే. ఈ నొప్పి వచ్చినప్పుడు కత్తిపోట్లు తగిలినట్టుగా దేనితోనో పదునైన వస్తువుతో గుర్చినట్టుగా బాధపెడుతూ ఉంటుంది. కాస్త కదిలినా చాలా నొప్పిగా ఉంటుంది. 


2. దీర్ఘకాలిక వెన్ను నొప్పిని నివారించడానికి ఇదే మార్గం.

రోజుకు కొన్ని నిముషాలు కేటాయించడంతో ఈ నొప్పి నుంచి తప్పించుకోవచ్చు. అదెలాగంటే క్రమబద్ధమైన శారీరక శ్రమ వీపును, వెన్నుముకను బలపురుస్తుంది. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల శరీరం గట్టిపడి నరాల కదలికలు సజావుగా ఉంటాయి. వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల వెన్నుపూస దగ్గర నరాలు బలంగా మారుతాయి.


3. వ్యాయామం సమయంలో వెన్ను కదలికలు ఇబ్బందిగా మారుతున్నాయా?

ఏ రకమైన కదలికల వల్ల నొప్పి పెరుగుతుంది అనేది గమనించాలి. డాక్టర్ సలహాతో ఫిజికల్ థెరపిస్ట్ సహాయం తీసుకోవడం తప్పనిసరి. సమస్యను మరీ పెద్దది చేసుకోకుండా ఉండటం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

4. వీలైనంత చురుకుగా ఉండటానికి, బెడ్ రెస్ట్ తగ్గించడానికి, ఐస్ లేదా హీట్ కంప్రెస్‌లను ఉపయోగించాలి.

5. కావాలనుకుంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లేదా అనాల్జేసిక్ మందులు తీసుకోలి.

6. ఇంటి వ్యాయామాలలో పాల్గొనడానికి రోగిని ప్రోత్సహించాలి. 

7. కొన్ని వారాల కంటే ఎక్కువ స్వీయ-సంరక్షణ తర్వాత మీ వెన్నునొప్పి కొనసాగితే, ముఖ్యంగా తీవ్రమైనది.

8. విశ్రాంతితో మెరుగుపడకపోతే, బలహీనత, తిమ్మిరి లేదా కాళ్ళలో జలదరింపు, మోకాలి కింద ఇబ్బంది మొదలైతే వైద్యుడిని సంప్రదించాలి.

9. బరువు తగ్గడం అవసరం.. అధిక బరువు ఉండటం కూడా ఒక్కోసారి వెన్నుముక మీద ఒత్తిడిని పెంచుతుంది.

Updated Date - 2022-09-01T18:03:29+05:30 IST