పంచదార ఎగుమతులు... పది మిలియన్ టన్నులకు పరిమితం ?

ABN , First Publish Date - 2022-05-24T23:40:18+05:30 IST

ఆరేళ్లలో తొలిసారిగా చక్కెర ఎగుమతులను పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

పంచదార ఎగుమతులు...  పది మిలియన్ టన్నులకు పరిమితం ?

న్యూఢిల్లీ : ఆరేళ్లలో తొలిసారిగా చక్కెర ఎగుమతులను పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. భారత్... ప్రపంచంలో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు. అంతేకాకుండా... బ్రెజిల్ తర్వాత రెండవ అతిపెద్ద ఎగుమతిదారు. దేశీయ ధరల పెరుగుదలను నిరోధించేందుకుగాను...  ఆరేళ్లలో మొదటిసారిగా చక్కెర ఎగుమతులను పరిమితం చేయాలని భారత్ యోచిస్తున్నట్లు ప్రభుత్వవర్గాల నుంచి వినవస్తోంది, ఈ సీజన్ ఎగుమతులను 10 మిలియన్ టన్నులకు పరిమితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ ధరల పెరుగుదలను నిరోధించడానికి ఆరేళ్లలో మొదటిసారిగా చక్కెర ఎగుమతులను పరిమితం చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు వినవస్తోంది. కాగా... మరోవైపు... షుగర్ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. భారత్ స్వంత ఆహార సరఫరాలను కాపాడుకోవడానికి ముందుజాగ్రత్త చర్యగా చక్కెర ఎగుమతులను పరిమితం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు వరకు కొనసాగే మార్కెటింగ్ సంవత్సరానికి చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకు పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్టోబరులో తదుపరి చక్కెర సీజన్ ప్రారంభమయ్యేలోపు తగినంత నిల్వలు ఉన్నాయని నిర్ధారించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2022-05-24T23:40:18+05:30 IST