బియ్యమేనా..!

ABN , First Publish Date - 2021-02-27T03:32:02+05:30 IST

ఇంటింటికి పంపిణీ చేస్తున్న రేషన్‌ సరుకుల్లో లబ్దిదారులకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుండడంతో వినియోగదారులు చక్కెర, కందిపప్పు ఇవ్వరా అంటూ వివాదానికి దిగారు.

బియ్యమేనా..!

చక్కెర, కందిపప్పు ఇవ్వరా?

వివాదానికి దిగిన కార్డుదారులు

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 26: ఇంటింటికి పంపిణీ చేస్తున్న రేషన్‌ సరుకుల్లో లబ్దిదారులకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుండడంతో వినియోగదారులు చక్కెర, కందిపప్పు ఇవ్వరా అంటూ వివాదానికి దిగారు. శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని షాపు-2 చౌక దుకాణం పరిధిలోని కార్డుదారులకు వాహనమిత్ర నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. అయితే కార్డుదారులకు కందిపప్పు, చక్కెర ఇవ్వకుండా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడంతో వారు వాహనమిత్రను ప్రశ్నించారు. తనకు తెలియదని సంబంధిత డీలర్‌ బియ్యం మాత్రమే ఇచ్చారని కార్డుదారులకు సూచించారు. ఆ షాపు పరిధిలో సుమారు 400 మంది కార్డుదారులు ఉండగా అరకొరగా అన్ని రకాల వస్తువులు పంపిణీ చేశారని కార్డుదారులు వాపోతున్నారు.

Updated Date - 2021-02-27T03:32:02+05:30 IST