చెరకు రసాన్ని ఇలా కూడా తీయవచ్చా?... చూస్తే నవ్విపోతారు!

ABN , First Publish Date - 2022-07-02T14:50:58+05:30 IST

దేశంలోని చాలామందిలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది.

చెరకు రసాన్ని ఇలా కూడా తీయవచ్చా?... చూస్తే నవ్విపోతారు!

దేశంలోని చాలామందిలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. అది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. దీనిని చూసిన జనం తెగ ఆశ్చర్యపోతుంటారు. దేశంలోని కొందరు క్రియేటర్స్ కార్లు మొదలుకొని హెలికాప్టర్ల వరకూ అన్నింటినీ తయారు చేసేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలో కొత్తగా చెరుకు రసాన్ని తీసేందుకు కొత్త విధానం తెరమీదకు వచ్చింది. దానిని చూసిన వారంతా ముక్కునవేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


బైక్ సాయంతో చెరుకు రసం తీయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఓ వ్యక్తి బైక్‌కు పొడవాటి కర్రను కట్టి, దానితో అతను గుండ్రంగా తిరుగుతుండగా, మధ్యలో ఒక యంత్రం నుండి చెరకు రసం తీయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది. దీనిని చూసినవారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఫన్నీ వీడియో RANDOM FACTS అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షన్నరకు పైగా వీక్షణలు రాగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్‌లు పంచుకున్నారు. 



Updated Date - 2022-07-02T14:50:58+05:30 IST