విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్‌ని సందర్శించిన నటి సుహాసిని

Jul 24 2021 @ 16:30PM

విజయ కృష్ణ మూవీస్ సంస్థ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థని ఇటీవల ‘విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్’ పేరుతో సీనియర్ నరేష్, ఆయన తనయుడు నవీన్ విజయకృష్ణ పునర్నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టూడియోస్‌లో సినీ పరిశ్రమకు కావాల్సిన అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు. తాజాగా ఈ స్టూడియోస్‌ని నరేష్ స్నేహితురాలు, సినీ నటి సుహాసిని సందర్శించారు. తన స్నేహితురాలికి స్టూడియోలోని అన్ని విభాగాలను నరేష్ చూపించడంతో పాటు, ఆమెను స్టూడియోలో సన్మానించారు. సుహాసిని మణిరత్నం ఈ ‘విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్’ సందర్శించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.