Suicide Attempt: రామంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ ఘటనలో కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2022-08-19T21:22:20+05:30 IST

ఓ ప్రైవేట్ కాలేజీ (Private college)లో జరిగిన ఘటనలో కొత్త ట్విస్ట్ (twist) వెలుగులోకి వచ్చింది.

Suicide Attempt: రామంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ ఘటనలో కొత్త ట్విస్ట్

హైదరాబాద్ (Hyderabad): రామంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ (Private college)లో జరిగిన ఘటనలో కొత్త ట్విస్ట్ (twist) వెలుగులోకి వచ్చింది. సాయి నారాయణ అనే విద్యార్థి ఫీజు (fee) విషయంలో ప్రిన్సిపాల్ (Principal) సుధాకర్ రెడ్డితో వాగ్వాదం జరిగింది. ఆ గదిలో విద్యార్థి సాయి నారాయణతో పాటు విద్యార్థి సంఘం నేత సందీప్ ఉన్నాడు. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ వెనక్కి తగ్గకపోవడంతో.. ఒంటిపై పెట్రోల్ (Petrol) పోసుకొని సందీప్ బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే కాలేజీ యాజమాన్యం పూజ చేసి ప్రిన్సిపాల్ రూమ్లో దీపం పెట్టారు. కాగా స్టూడెంట్ యూనియన్ లీడర్ సందీప్ పెట్రోల్ పోసుకొని నిరసన తెలపడంతో ప్రమాదవశాత్తు దీపం అంటుకొని గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో సందీప్తో పాటు ఏవో అశోక్రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్కి గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-08-19T21:22:20+05:30 IST