గుంటూరులో అంతుచిక్కని ఆత్మహత్యల కేసు

ABN , First Publish Date - 2021-03-27T16:59:33+05:30 IST

ఆత్మహత్యల కేసు పోలీసులకు అంతుచిక్కడం లేదు..

గుంటూరులో అంతుచిక్కని ఆత్మహత్యల కేసు

  • పెద్ద కుమారుడిని వెతుక్కుంటూ వచ్చినట్టు చెప్పిన తల్లి
  • ఆ దిశగా పోలీసుల ముమ్మర దర్యాప్తు

గుంటూరు/దెందులూరు : ఆత్మహత్యల కేసు పోలీసులకు అంతుచిక్కడం లేదు.. అసలు గుంటూరు నుంచి దెందులూరు మండలం శింగవరం ఎందుకు వచ్చారు.. ఎప్పుడు వచ్చారు.. ఎందుకు ఇక్కడే ఆత్మహత్యలకు పాల్పడ్డారనే దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని తుర్ల పాడుకు చెందిన పావులూరి వెంకట నారాయణ భార్య తులసి, చిన్న కుమారుడు భాను వికాస్‌ శింగవరంలో బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు  పాల్పడిన ఘటన విధితమే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యలకు పాల్ప డినట్టు పోలీసులు తొలుత భావించారు.. అయితే అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణ తులసి పెద్ద కుమారుడిని వెతుక్కుంటూ జిల్లాకు వచ్చినట్టు చెప్పడంతో కేసు మరో మలుపు తిరిగింది.


ఢిల్లీ వెళ్లి వచ్చిన రాజేష్‌ తల్లిదండ్రుల వద్దకు రాకుండా ఎక్కడకు వెళ్లాడు..ఫోన్‌ ఎందుకు స్విచ్చాఫ్‌లో ఉంది. ఎక్కడ ఉన్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు. బాధితులుతాగిన పురుగుల మందు తాడేపల్లి గూడెంలో కొనుగోలు చేసినట్టు ఉంది. ఈ నేపథ్యంలో దెందులూరు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. యడ్లపాడులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ తులసి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా భర్త,చిన్న కుమారుడు మృతిని చెప్పకుండా దాచారు. వైద్యులు, బంధువుల కోరిక మేరకు కృష్ణ తులసిని ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా పోయింది. పెద్ద కుమారుడు పోలీసులకు చిక్కి తేనే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. 


కాల్‌ డేటాతో దర్యాప్తు

మృతుల కాల్‌ డేటా సేకరించాం.. ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరికి ఫోన్‌ చేశారు. ఎంత సేపు మాట్లాడారు. ఆ వివరాలు మూడు రోజుల్లో వస్తాయి. ఆ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తాం.. ప్రస్తుతం పెద్ద కుమారుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం. - రాంకుమార్‌, ఎస్‌ఐ.


Updated Date - 2021-03-27T16:59:33+05:30 IST