గ్రామీణ వైద్యుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-24T04:44:28+05:30 IST

మండల పరిధిలోని రాయగూడెం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు దామాల నర్సింహారావు(47)కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందును నీటిలో కలుపుకుని తాగాడు. అప్పటికీ ఆగక అప్పలనర్సింహాపురం సమీపంలోని ఓవ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సింహా33రావు ఈనెల 19 నుంచి ఇంట్లో నుంచి వెళ్లాడు.

గ్రామీణ వైద్యుడి ఆత్మహత్య

నేలకొండపల్లి, అక్టోబరు 23: మండల పరిధిలోని రాయగూడెం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు దామాల నర్సింహారావు(47)కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందును నీటిలో కలుపుకుని తాగాడు. అప్పటికీ ఆగక అప్పలనర్సింహాపురం సమీపంలోని ఓవ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సింహా33రావు ఈనెల 19 నుంచి ఇంట్లో నుంచి వెళ్లాడు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంట్లో నుంచి వెళ్లాక తాను చనిపోతానని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తిరిగి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. 19 నుంచి నర్సింహారావు కోసం వెదికిన కుటుంబ సభ్యులు అదే రోజు నేలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి పొలం యజమాని ఐతరాజు రమేష్‌ బావి వద్దకు వెళ్లగా అక్కడ ద్విచక్రవాహనం కనపడటంతో రైతు ముదిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముదిగొండ పోలీసులు నెంబరు ఆధారంగా నేలకొండపల్లి పోలీసులకు సమాచారం అందించారు. నేలకొండపల్లి పోలీసులు బావి వద్దకు వెళ్లి గాలించినప్పటికీ ఫలితం కానరాలేదు. శనివారం ఉదయం నేలకొండపల్లి ఏఎస్సై రాఘవయ్య సిబ్బందితో సంఘటనా స్ధలానికి వెళ్లి బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా చేశారు. మృతదేహం కుళ్లిపోవడంతో బావి వద్దనే పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. కాగా మృతుడు అయ్యప్ప దీక్షలో ఉండటం గమనార్హం.

Updated Date - 2021-10-24T04:44:28+05:30 IST