ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-02T06:46:18+05:30 IST

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపంతో పురు గులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది.

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో విషాదం

తల్లాడ, జూలై 1: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపంతో పురు గులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ముదిగొండ త్రివేణి(22)ని ఇదే మండలం కలకొడిమ గ్రామానికి చెందిన రవీందర్‌ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఎనిమిది నెలలుగా నమ్మించాడు. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకోవాలని త్రివేణి అడగ్గా.. కులాలు వేరు కావడంతో అందుకు ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన త్రివేణి జూన్‌ 27న కుర్నవల్లిలోని ఇంటివెనుక ఖాళీస్థలంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తల్లాడ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకున్నారు. 

Updated Date - 2022-07-02T06:46:18+05:30 IST