అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-27T04:10:43+05:30 IST

అప్పుల బాధతో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలో చోటు చేసుకున్నది.

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

దుబ్బాక, జూలై 26 : అప్పుల బాధతో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గూడూరు దేవేందర్‌ (27) కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా పనులు లేకపోవడంతో కుటుంబ పోషణకు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-07-27T04:10:43+05:30 IST