కువైత్‌లో పెరుగుతున్న ఆత్మహత్యల రేటు.. జాబితాలో భారతీయులే టాప్!

ABN , First Publish Date - 2022-03-15T18:55:07+05:30 IST

తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం కువైత్‌లో గత రెండేళ్లతో పోల్చుకుండే ఈ ఏడాది ఆత్మహత్యల రేటు ఏకంగా 50 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

కువైత్‌లో పెరుగుతున్న ఆత్మహత్యల రేటు.. జాబితాలో భారతీయులే టాప్!

కువైత్ సిటీ: తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం కువైత్‌లో గత రెండేళ్లతో పోల్చుకుండే ఈ ఏడాది ఆత్మహత్యల రేటు ఏకంగా 50 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. గడిచిన 70 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 25 బలవన్మరణాలు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఆసియా వాసులు ఉన్నారు. అందులోనూ భారతీయులు 60 శాతంతో టాప్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో 19 నుంచి 35 ఏళ్ల వయసు వారు 60శాతం ఉంటే.. 36-65ఏళ్ల మధ్య వయస్కులు 36శాతం ఉన్నట్లు డేటా తెలుపుతోంది. 


అలాగే సూసైడ్ చేసుకుంటున్నవారిలో 80శాతం మంది మగవారేనని తెలిసింది. ఈ సందర్భంగా కువైటీ సైకాలజిస్ట్ అసోసియేషన్ కీలక సూచన చేసింది. పౌరులు, ప్రవాసులకు మానసిక, సామాజిక మద్దతును అందించడం ద్వారా వారికి ఆత్మహత్యకు దారితీసే ప్రతికూల ఆలోచనలను ఎదుర్కొనే సామర్థ్యం ఏర్పడుతుందని పేర్కొంది. అలాగే కరోనా మహమ్మారి సమయంలో కువైత్‌లో యువకులు, పిల్లలలో పెరుగుతున్న ఆత్మహత్యలపై చర్చించడానికి ప్రభుత్వ సంస్థలతో కలిసి “యువర్ లైఫ్ ఈజ్ డియర్- మీ జీవితం ప్రియమైనది” అనే నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా అసోసియేషన్ గుర్తు చేసింది.

Updated Date - 2022-03-15T18:55:07+05:30 IST