వైవిధ్యమైన పంటలకు అనుకూల నేలలు

ABN , First Publish Date - 2022-09-24T06:06:26+05:30 IST

భారతదేశంలో వైవిద్యమైన పంటలను పండించేందుకు అనుకూలంగా నేలలు ఉన్నాయని, చిరుధాన్యాలు తినే ఆచారం మన వద్ద ఉందని వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు.

వైవిధ్యమైన పంటలకు అనుకూల నేలలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు

 - వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 23: భారతదేశంలో వైవిద్యమైన పంటలను పండించేందుకు అనుకూలంగా నేలలు ఉన్నాయని, చిరుధాన్యాలు తినే ఆచారం మన వద్ద ఉందని  వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని కొత్తచెరువు బండ్‌పార్కులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మిల్లెట్స్‌ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ  ఇటువంటి కార్యక్రమాలను మండల స్థాయిలోనూ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని గొప్పగా అమలు చేస్తుందని అన్నారు. వచ్చే సంవత్సరం వేములవాడ గుడిచెరువు కట్టపై ఫుడ్‌ఫెస్టివల్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ పిల్లలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాధాన్యం  తెలియజేసేందుకు  మంత్రి కేటీఆర్‌  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని,  విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం 15 పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను కలెక్టర్‌తో పాటు జడ్పీచైర్‌పర్సన్‌, అధికారులు రుచిచూశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు అలరించాయి.  పవర్‌లూం అండ్‌ టెక్స్‌టైల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, డీఈవో రాధాకిషన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు,  ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-24T06:06:26+05:30 IST