సుల్తానాబాద్‌ సొసైటీ సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2022-10-02T05:41:27+05:30 IST

సుల్తానాబాద్‌ సహకార సంఘం ఇత ర సంఘాలకు ఆదర్శంగా నిలిచిందని సహకార సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు అన్నారు.

సుల్తానాబాద్‌ సొసైటీ సేవలు అభినందనీయం
ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్న కొండూరి, ఎమ్మెల్యే

- నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు

సుల్తానాబాద్‌, అక్టోబరు 1: సుల్తానాబాద్‌ సహకార సంఘం ఇత ర సంఘాలకు ఆదర్శంగా నిలిచిందని సహకార సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు అన్నారు. సుల్తానాబాద్‌ సహకార సంఘం అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాట ర్‌ ప్లాంట్‌ను ఆయన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి శనివా రం ప్రారంభించారు. అనంతరం ఏఏంసీ సమీపంలో సొసైటీ వారు నిర్మించిన వాణిజ్యసముదాయాలను ప్రారంభించారు. పలువరు రైతు లకు ట్రాక్టర్లను, నాలుగుచక్రాల వాహనాలను పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ, సహకార శాఖ వారు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. సభా ప్రారంభంలోనే సొసైటీ వారు తయారుచేసిన వాటర్‌ బాటిళ్లను ఆవిష్కరించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ సహకార సంఘాల్లో డి పాజిట్లు పెంచుకోవాలని, రైతులు వారి కుటుంబ సభ్యులు ఇందులో డిపాజిట్లు చేయడం వలన సంఘాలు మరింత బలోపేతమై రైతుల కు మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తారన్నారు. సుల్తానాబాద్‌ సొసైటీ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కేడీసీసీబీ డైరక్టర్‌ శ్రీగిరి శ్రీనివాస్‌ను, సింగిల్‌ విండో డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. సహకార స్ఫూర్తికి నిదర్శ నంగా సుల్తానాబాద్‌ సంఘం నిలిచిందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అ న్నారు. ఎరువులు విత్తనాలు ప్రతీ సీజన్‌లో అందుబాటులో ఉంచడ మే కాకుండా అన్నిరకాల పంట రుణాలిస్తూ వాటిని సకాలంలో రికవ రీ చేస్తున్నారని కొనియాడారు. సీఈవో సత్యనారాయణరావు మాట్లా డుతూ కేడీసీసీబీ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బీ డైరక్టర్‌ దేవరనేని మోహన్‌రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షు డు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ స్వరూపప్రకా ష్‌రావు, మార్కెట్‌ చైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌, ముత్యం రమేష్‌, సొసైటీ చైర్మన్లు జూపల్లి సందీప్‌రావు, మహిపాల్‌రెడ్డి భాస్కర్‌రెడ్డి, కమలాక ర్‌, డీసీవో మైఖేల్‌బోస్‌, సీఈవో సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:41:27+05:30 IST