పగలు ఎండ.. రాత్రి థండా

ABN , First Publish Date - 2021-03-07T05:57:00+05:30 IST

వాతావరణం మారిపోతోం ది. వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులు చో టు చేసుకుంటున్నాయి.

పగలు ఎండ.. రాత్రి థండా

- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

- రాత్రిళ్లు తగ్గని చలిగాలులు

- శివరాత్రికి ముందే ముదిరిన ఎండలు


మహబూబ్‌నగర్‌, మార్చి 6 : వాతావరణం మారిపోతోం ది. వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులు చో టు చేసుకుంటున్నాయి. ఉదయం ఎండలు కాస్తుండగా, రా త్రిళ్లు చలి పెడుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది శివరాత్రి తరువాత ఎండలు ఊపందుకుంటాయి. ఈ ఏడాది మాత్రం శివరాత్రికి పది రోజుల ముందు నుంచే ఉదయం పూట ఉ క్కపోత మొదలైంది. గత నెల 28న 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో గ్రత నమోదు కావడం ఇందుకు ఉదాహరణగా చెప్పాల్సి వస్తోంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గతేడాది మార్చి 22వ తేదీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించా యి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. క రోనా భయంతో ప్రజలు గడప దాటి బయటకు రాలేదు. సు దీర్ఘ కాలం లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ఎండాకాలం కాస్త కరోనా కాలంగా మారిపోయింది. అయితే, వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో కాలుష్య ప్రభావం త గ్గిపోయి, తేమ శాతం పెరిగింది. దీని వల్ల ఆ ఏడాది ఎండ లు తక్కువగా కాశాయి. ఈ ఏడాది మాత్రం ఎండలు భ యంకరంగా ఉండనున్నాయి. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో రి కార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.


మొదలైన సమ్మర్‌ బిజినెస్‌

గతేడాది కరోనాతో అతలాకుతలమైన సమ్మర్‌ బిజినెస్‌, ఈ ఏడాది ఆశాజనకంగా జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే ప్రజలు ఉష్ణతాపం నుంచి బయట పడేందుకు ప్రత్యామ్నా యాలు వెతుక్కుంటున్నారు. పాత కూలర్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. ఏసీలను సర్వీసింగ్‌ చేయించుకుంటున్నారు. చెరుకు రసం, నిమ్మకాయ రసం, లస్సీ, సొడా, కూల్‌డ్రింక్‌, జ్యూస్‌, ఐస్‌క్రీమ్‌, బట్టర్‌మిల్క్‌, కొబ్బరిబోండాల దుకాణాలు ప్రధాన రహదారుల వెంట వెలుస్తున్నాయి. అలాగే మట్టి కుండలు దుకాణాలూ, టోపీలు, కూలింగ్‌ గ్లాసెస్‌ దుకాణాల వ్యాపారం కూడా మొదలైంది.

Updated Date - 2021-03-07T05:57:00+05:30 IST