నైపుణ్యాలను పెంపొందించుకోండి

ABN , First Publish Date - 2022-05-18T05:32:33+05:30 IST

వేసవి సెలవులను గ్రంథాలయ విజ్ఞాన శిబి రంలో పాల్గొని విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్‌పర్సన్‌ చీర్ల పద్మశ్రీ పిలుపునిచ్చారు.

నైపుణ్యాలను పెంపొందించుకోండి
ఏలూరులో మాట్లాడుతున్న గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ చీర్ల పద్మశ్రీ

గ్రంథాలయాల సంస్థ చైర్‌పర్సన్‌ చీర్ల పదశ్రీ

విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం

ఏలూరు టూటౌన్‌, మే 17:  వేసవి సెలవులను గ్రంథాలయ విజ్ఞాన శిబి రంలో పాల్గొని విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్‌పర్సన్‌ చీర్ల పద్మశ్రీ పిలుపునిచ్చారు. గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరం మంగళవారం ఏలూరు జిల్లా గ్రంథాలయంలో ప్రారం భించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు  వేసవిలో విజ్ఞానం పెంపొందించేందుకు ప్రభుత్వం వేసవి శిబిరాలను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్‌ మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దు తాయన్నారు. సర్వ శిక్ష అభియాన్‌ అడిషనల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ శ్యామ్‌ సుందర్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించాలన్నారు. వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ జే.ప్రభాకర్‌ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలన్నారు. వెంకటేశ్వరరావు, విజ్ఞాన శిబిరం కన్వీనర్‌ నాగా్‌స్త్ర ఉపగ్రంథ పాలకులు శ్రీనివాస్‌, కాంతారావు, ఆనందనాయుడు, ముస్తాఫా అలీ, కృష్ణారావు, సందీప్‌, లక్ష్మీ, ప్రవీణ, దుర్గా, రమణ, తదితరులు పాల్గొన్నారు. బాలల గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరాన్ని అభివృద్ధి కమిటీ సభ్యుడు అచ్యుత ప్రారంభించారు.అభివృద్ధి కమిటీ చైర్మన్‌ నరసింహారావు, సభ్యుడు చెన్నా వెంకటరామయ్య  గ్రంథపాలకురాలు ఎం.శోభ పాల్గొన్నారు. మహిళా గ్రంథాలయంలో జీవీ రమణ పిల్లలకు ఆటలపోటీలు నిర్వహించారు.  అభి వృద్ధి కమిటీ అధ్యక్షురాలు సుశీల,గ్రంథపాలకురాలు శ్రీదేవి పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-18T05:32:33+05:30 IST