వేసవిలో ఇలా..!
ABN , First Publish Date - 2021-04-26T05:30:00+05:30 IST
వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలోనూ, ధరించే దుస్తుల్లోనూ మార్పులు చేసుకోవాలి...
వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలోనూ, ధరించే దుస్తుల్లోనూ మార్పులు చేసుకోవాలి.
- ఎక్కువ నీరు తాగాలి. వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి తరచుగా నీరు తాగుతూ ఉండాలి.
- చెమట ద్వారా మినరల్స్ బయటకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటూ శరీరంలో ఎలక్రోలైట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి.
- వీలైనంత వరకు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు పట్టుకుని వెళ్లాలి.
- కేఫిన్, ఆల్కహాల్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. వీటిల్లో ప్రిజర్వేటివ్స్, కలర్, షుగర్ ఉంటుంది. ఇవి అసిడిక్ గుణం కలిగి ఉండి డైయూరిటిక్స్గా పనిచేస్తాయి. చాలా సాఫ్ట్డ్రింక్ల్లో డైల్యూటెడ్ ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని ఎక్కువ తీసుకుంటే రక్తంలో ఫాస్ఫారిక్ లెవెల్స్ పెరిగిపోతాయి.
- వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. సమోస, వడ, చిప్స్, బజ్జీలు వంటి పదార్థాలను తినకూడదు.
- తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవాలి. బ్రేక్‌ఫా్‌స్టలో ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. పండ్లు క్రమంతప్పకుండా తినాలి.
- మధ్యాహ్నం లంచ్‌లో సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. దోసకాయతో చేసిన సలాడ్ చల్లదనాన్ని అందిస్తుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
- ఎండలోకి వెళ్లివచ్చిన తరువాత మరీ చల్లగా ఉండే పానీయాలను, ఐస్‌క్రీమ్‌లాంటి పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు.