సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు భద్రత ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2021-12-04T06:24:07+05:30 IST

మండలంలోని నింబగల్లు సమీపంలో నిర్మించిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు గట్టు భద్రత ప్రశ్నార్థకమైంది. సీపీడబ్య్లుఎస్‌ స్కీంకు చెందిన మూడవ సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు గట్లు బలహీనపడ్డాయి.

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు భద్రత ప్రశ్నార్థకం
కుంగిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ గట్టు

ఉరవకొండ, డిసెంబరు 3: మండలంలోని నింబగల్లు సమీపంలో నిర్మించిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు గట్టు భద్రత ప్రశ్నార్థకమైంది. సీపీడబ్య్లుఎస్‌ స్కీంకు చెందిన మూడవ సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు గట్లు బలహీనపడ్డాయి. గట్టు పైభాగంలో మట్టి కట్ట మొత్తం నెర్రెలు చీలి  నాలుగు అడుగుల లోతు మేరకు కుంగిపోయింది. ఎప్పుడు తెగిపోతుందో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1997లో ఈ ట్యాంకును నిర్మించారు. భద్రతపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే రెండోసారి కాలువ గట్టు కుంగిపోయింది. రెండేళ్ల కిందట గట్టు కుంగిపోయిన ప్రాంతంలో తాత్కాలిక మర్మతులు చేశారు. ట్యాంకు నీటి నిల్వ సామర్థ్యం 6 మీటర్లు కాగా, ప్రస్తుతం 3.5 మీటర్లు నీటిని నిల్వ ఉంచారు. అంతకు మించి నీ టిని నిల్వ చేసే పరిస్థితి లేదు. గట్టుకు అడ్డంగా లోపలివైపున వే సిన బండలు కూడా దెబ్బతిన్నాయి. రెండవ ట్యాంకు ఉన్నా నిరుపయోగంగా మారింది. ఈ ట్యాంకుకు 2018లో రూ.1.60 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. నాలుగేళ్లవుతున్నా వినియోగంలోకి తీసుకురాలేదు. పిచ్చిమొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఈ వెంకటరమణ ఇటీవల కుంగి పోయిన చెరువు గట్టును పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూ చించారు. ఇందుకోసం రూ.40 లక్షలతో ప్రతిపాదనలు పంపినట్లు డీఈ షఫ్రీన తెలిపారు. అధికారులు వెంటనే గట్టు భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-04T06:24:07+05:30 IST