టాంక్ బండ్ పై సన్ డే ఫన్ డే

ABN , First Publish Date - 2021-11-28T22:16:58+05:30 IST

ప్రతి ఆదివారం నగరంలోని టాంక్ బండ్ పై నిర్వహిస్తున్న సన్ డే ఫన్ డే నగర వాసులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

టాంక్ బండ్ పై సన్ డే ఫన్ డే

హైదరాబాద్: ప్రతి ఆదివారం నగరంలోని టాంక్ బండ్ పై నిర్వహిస్తున్న సన్ డే ఫన్ డే నగర వాసులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రతి వారం జీహెచ్ఎంసి, హెచ్ఎండిఏ సంయుక్తంగా వివిధ రకాల థీమ్ లతో సన్ డే ఫన్ డే నిర్వహిస్తున్నాయి. ఈ ఆదివారం రోజున స్వచ్చత అన్నథీమ్ తో నిర్వహిస్తున్నట్టు హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్చ సర్వేఓన్ అవార్డులను దక్కించుకుంది. ఈ కేటగిరీలో 12 అవార్డులను హైదరాబాద్ నగరం గెలుచుకుని 3 స్టార్ రేటింగ్ ను సాధించింది. జాతీయ స్థాయిలో గార్బేజ్ ఫ్రీ సిటీ కేటగిరీ, బెస్ట్ సెల్ఫ్ సస్టెయినింగ్ సిటీ అవార్డులను దక్కించుకుంది. 


ఈ నేపధ్యంలో నగర వాసుల్లో మరింతగా స్వచ్చత పై అవగాహన పెంచేందుకు ఈ ఆదివారం సండే ఫన్ డేలో భాగంగా స్వచ్చతా సండే ఫన్ డే నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. టాంక్ బండ్ పై ఆదివారం సాయంత్రం జీహెచ్ఎంసి టీమ్స్ సందడి చేయనున్నాయి. గార్బేజ్ ను సగ్రిగేషన్ ప్రాధాన్యతను వివరించనునా్నరు దీంతో హోమ్ కంపోస్టింగ్ పై కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో కమ్యూనిటీ భాగస్వామ్యం పై కూడా అవగాహన కల్పించనున్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఎదిగేందుకు 5స్టార్ సాధించేందుకు ప్రజల సహకారాన్ని అధికారులు కోరనున్నారు. 


నిర్మాణ వ్యర్ధాలు, శిధిలాలు తదితర వాటిని ఏ విధంగా తొలగించుకోవాలన్న విషయాలను తెలియజేయనున్నారు. సెల్పీపాయింట్ పరిశుభ్రంగా ఎలా ఉంచాలన్నది తెలియజేయనున్నారు. ఇలాంటి అవగాహనా కార్యక్రమాలతో పాటు ప్రతి వారం మాదిరిగానే టాంక్ బండ్ పై షాపింగ్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ నిర్వహించనున్నారు. ఈ స్టాళ్లలో కూడా ప్లాస్టిక్ వినియోగించకుండా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హెచ్ఎండిఏ లోని అర్బన్ ఫారెస్ర్టీ తరపున స్టాల్స్ ఏర్పాటుచేసి 30 రకాల ఔషధ మొక్కలను కూడా సందర్శకులకు పంపిణీ చేయనున్నారు. 

Updated Date - 2021-11-28T22:16:58+05:30 IST