సూర్య ప్రతాపం

ABN , First Publish Date - 2021-05-10T06:38:27+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు వేడిగాలులకు వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

సూర్య ప్రతాపం
నల్లగొండలో వేసవి తాపానికి చెట్టు నీడకు చేరిన గొర్రెలు

ఉమ్మడి జిల్లాలో మండుతున్న ఎండలు 

వారం రోజులుగా 40 డిగ్రీలపైనే నమోదు 

నల్లగొండ, మే 9: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు వేడిగాలులకు వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తీవ్రత మే నెలలో అధికమైంది. ఆదివారం నాడు ఉమ్మడి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్ర త 24.4 డిగ్రీలుగా నమోదైంది. ఓ వైపు కరోనా భయం, మరోవైపు ఎండల భయం ప్రజలను వెంటాడుతోంది. మరో 25 రోజులపాటు ఎండల తీవ్రత కొనసాగనుంది. జూన్‌ మొదటి వారంలో తొలకరి చినుకుల ద్వారానే వా తావరణం చల్లబడుతుంది. జూన్‌లో మృగశిర కార్తె నుంచి ఎండలు తగ్గుముఖం పడుతాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతలపానియాలు, పుచ్చకాయలు, ఐస్‌క్రీములు, చెర కు రసాలు, కొబ్బరి బోండాలను తాగుతున్నారు. మరికొద్ది రోజులపాటు ఇదే తీవ్రతతో ఎండలు మండిపోనున్నాయి. కరోనా భయంతోపాటు ఎండల తీవ్రతతో పగటిపూట రోడ్లపై జనసంచారం తగ్గిపోయిం ది. ఎండలకు ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీలైనంత మేరకు ప్రజ లు  ఎండల సమయంలో బయటకు వెళ్లకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.   

Updated Date - 2021-05-10T06:38:27+05:30 IST